హోమ్ /వార్తలు /తెలంగాణ /

‘లా పాయింట్’ పట్టిన హరీశ్ రావు.. ఏపీని ఉదాహరణగా చూపుతూ బీజేపీపై ఫైర్

‘లా పాయింట్’ పట్టిన హరీశ్ రావు.. ఏపీని ఉదాహరణగా చూపుతూ బీజేపీపై ఫైర్

మంత్రి హరీశ్ రావు

మంత్రి హరీశ్ రావు

టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావులను బీజేపీలో విలీనం చేసుకున్న విషయాన్ని హరీశ్ రావు ప్రస్తావించారు. అది కరెక్టే అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభాపక్షం టీఆర్ఎస్‌లో చేరడం కూడా కరెక్టేనన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Telangana

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మీద తెలంగాణ రాష్ట్ర మంత్రి టి. హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఓ ఉదాహరణను తీసుకుని బీజేపీ మీద విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావులను బీజేపీలో విలీనం చేసుకున్న విషయాన్ని హరీశ్ రావు ప్రస్తావించారు. అది కరెక్టే అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభాపక్షం టీఆర్ఎస్‌లో చేరడం కూడా కరెక్టేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ తరఫున ఎన్నికైన లోక్‌సభ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద వేటు వేయాలని వైసీపీ నేతలు రెండేళ్ల నుంచి కోరుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అక్కడ ప్రభుత్వాలను కూల్చేశారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్ సహా చాలా రాష్ట్రాల్లో ఇలాగే ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు.

సబ్సిడీలు ఇవ్వొద్దన్న కేంద్రం

రైతులకు సబ్సిడీలు ఇవ్వకపోతే 20 పాయింట్లు ఇస్తామంటూ కేంద్రం తెచ్చిన చట్టంలో పేర్కొందని హరీశ్ రావు అన్నారు. రైతుల పొలాల్లో మోటార్లకు మీటర్లు పెడితే ఏడాదికి 0.5 శాతం నిధులు అధికంగా ఇస్తామని చట్టంలో కేంద్రం పేర్కొందని, అంటే ఏడాదికి రూ.6000 కోట్లు ఇస్తామందన్నారు. ఈ లెక్కడ ఐదేళ్లలో రూ.30,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉందని అయినా కూడా తాము రైతుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టడానికి విముఖత వ్యక్తం చేశామన్నారు.

ఇక మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్ సభ సక్సెస్ కావడంతో బీజేపీ నేతలు భయపడుతున్నారని అన్నారు. అందుకే ఉద్యోగ సంఘాల నేతల మీద విమర్శలు చేస్తున్నారన్నారు.

First published:

Tags: Harish Rao, Munugode Bypoll, Telangana, Telangana bjp, Trs

ఉత్తమ కథలు