Home /News /telangana /

HYDERABAD TELANGANA LIQUOR SALES REVENUE 15000 CRORE IN FIVE AND HALF MONTHS RANGAREDDY DISTRICT TOP SNR

Liquor Sales : ఐదున్నర నెలల్లో అన్ని లీటర్ల మద్యం తాగారు .. ఆదాయం ఎంతొచ్చిందంటే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Telangana: మద్యం అమ్మకాలపై తెలంగాణ సర్కారుకు వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. కేవలం ఐదున్నర నెలల్లో 15వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. అంటే కోట్ల ఫుల్‌ బాటిల్స్, బీర్‌ బాటిల్స్ కాళీ చేశారు మద్యం ప్రియులు. నెక్స్ట్ ఆరు నెలల్లో ఇంకా ఏ రేంజ్‌లో తాగుతారో చూడాలి.

ఇంకా చదవండి ...
తెలంగాణ(Telangana)లో మద్యం అమ్మకాలు సీజన్‌తో పని లేకుండా జోరుగా జరుగుతున్నాయి. సమ్మర్ ముగిసినప్పటికి మద్యం ప్రియులు బాటిళ్లకు బాటిళ్లు కాళీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కట్టబెడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గడిచిన ఆరు నెలల్లో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌(Excise Department)కి మద్యం అమ్మకంపైనే 15వేల 235కోట్ల రూపాయల(15,235 crore) ఆదాయం వచ్చిందంటే ఏ రేంజ్‌లో లిక్కర్ సేల్స్‌ జరిగాయో ఊహించుకోవచ్చు. తెలంగాణలో మద్యం అమ్మకాల విషయంలో రాష్ట్రం అంతా ఒక ఎత్తైతే ..రంగారెడ్డి జిల్లా(Rangareddy District)ను స్పెషల్‌గా చెప్పుకోవాలి. హైదరాబాద్‌(Hyderabad)లో సగం రంగారెడ్డి జిల్లాలో ఉండటం, శివార్లలో చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు, పరిశ్రమలతో పాటు రియలెస్టేట్( Realstate)వ్యాపారం జోరుగా ఉంటుంది. అలాగే ఈ జిల్లాలో నివసించే జనాభా సంఖ్య కూడా ఎక్కువే. దీనికి తోడు శంషాబాద్ విమనాశ్రయం(Shamshabad Airport)కూడా ఉండటంతో మద్యం విక్రయంలో రంగారెడ్డి జిల్లా టాప్‌ ప్లేస్‌లో నిలవడానికి ఒక కారణమైంది.

ఆరు నెలల్లో అంత తాగేశారా..
ఈఏడాది జనవరి నుంచి జూన్‌ 15వరకు ఎక్సైజ్‌శాఖ వెల్లడించిన లెక్కలు చూస్తే కేవలం ఐదున్నర నెలల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకంపై 15,235 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో కేవలం రంగారెడ్డి జిల్లా నుంచి 3,354 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు కోటి 65లక్షల 10వేల 978ఫుల్‌ బాటిల్స్‌ తాగిపారేశారు. 2కోట్ల 33లక్షల 69వేల 322 బీర్లు అమ్ముడయ్యాయి. స్టేట్‌ వైడ్‌గా లిక్కర్స్‌ సేల్స్ ఇలా ఉంటే ..ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 34,72,932 ఫుల్‌ బాటిల్స్, 51,51,058 బీర్లు తాగేసినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.మద్యం ఏరులై పారాల్సిందే..
మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదట్నుంచి రికార్డు స్థాయిలోనే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు కలిసి ఉండటం..ఇక్కడకు నిత్యం వేలాది మంది జీవనోపాధి, ఉద్యోగాలతో పాటు వ్యాపార అవసరాల కోసం వస్తూ ఉంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బూమ్‌ మరింత ఊపందుకోవడంతో ...సంపన్నులు, రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడులు పెట్టే వాళ్లు చుట్టు పక్కల ఫంక్షన్‌లు, పార్టీలకు నిత్యం కొదవ లేకుండాపోతోంది. దాంతో మద్యం అమ్మకాలు కూడా రంగారెడ్డి జిల్లాలో మూడు ఫుల్లు, ఆరు హాఫ్ బాటిల్స్‌గా సాగుతోంది.

ఇది చదవండి : ఆ ప్లేసుల్లో ఉండే అమ్మాయిల జోలికి వెళ్లారో అంతే.. పోకిరీలపై షీ టీమ్స్ షాడోసర్కారుకు దండిగా ఆదాయం..
జనవరి నుంచి జూన్‌ 15 వరకు జరిగిన అమ్మకాల ద్వారానే ఇంత ఆదాయం వస్తే రాబోయే ఆరు నెలలు అంటే జాతరలు, పండుగల సీజన్‌లో ఈ ఆదాయం రెట్టింపు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు వేల సంఖ్యలో ఉన్నప్పటికి రంగారెడ్డి జిల్లా పరిధిలో 234 లిక్కర్ షాపులు ఉన్నాయి. శంషాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలో 100, సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ ఆఫీస్‌ పరిధిలో 134 ఉన్నాయి. లిక్కర్ సేల్స్‌లో శంషాబాద్‌ ఎక్సైజ్‌ ఆఫీస్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటే సరూర్‌నగర్‌ జోన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, అవుటర్‌ రింగ్‌ రోడ్డులో ఉన్న మద్యం షాపుల్లో కూడా లిక్కర్ సేల్స్‌ జోరుగా సాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Liquor sales, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు