తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష జరగనుంది. దీంతో ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద ఎగ్జామ్ హాలుకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల తర్వాత పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులను అధికారులను అనుమతించలేదు.
ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యాల్ని హెచ్చరిస్తూ ఇంటర్ బోర్డు అధికారులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కాలేజీ అయినా ఇకపై అడ్వర్టైజ్ మెంట్ ఇవ్వాలంటే ఇంటర్ బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. యాడ్ కంటెంట్ నియంత్రణ, ఇతర విద్యా సమస్యలపై బోర్డు ఏర్పాటు చేసిన ఎనిమిది మంది సభ్యుల కమిటీ మేరకు మార్గదర్శకాలను రూపొందిస్తోందని తెలిపారు. ఒక టాప్ ర్యాంకర్ ఫొటోను ఇతర కాలేజీ యాడ్స్ లో వాడినట్లయితే కంటెంట్ మోడరేషన్ కింద సంబంధిత కాలేజీపై చర్యలు తీసుకుంటాని ఇంటర్ బోర్డు సెక్రెటరీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
అంతేకాకుండా, నిబంధనలకు విరుద్దంగా కాలేజీలు ఎగ్జామ్స్ అవ్వగానే ఎక్స్ ట్రా క్లాసులు, స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల విద్యర్థుల్లో ఒత్తిడి పెరుగుతుందన్నారు. అందుకే ఈ సమస్యపై కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు నవీన్ తెలిపారు. టీచర్లకు వచ్చే ఏడాది నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. మరోవైపు ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Inter exams, Local News, TS Inter Exams 2022