పచ్చగా, ఆహ్లదకరంగా ఉన్న లింగం పల్లి (Lingalpally) పరిధిలోని హుడా లేఅవుట్ లో కొందరు వ్యర్థ పదార్థాలను డంపింగ్ చేస్తూ పర్యవరణాన్ని కలుషితం చేస్తున్నారని స్థానికంగా ఉన్న కాలనీ వాసులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కొన్ని రోజులుగా సమీపంలోని రామ్ కీ, అపర్ణ లే అవుట్ లోని వ్యర్థాలు, అదే విధంగా నల్లగండ్ల లోని.. ఇతర పెద్ద గెటేడ్ కమ్యూనిటీ లోని వ్యర్థాలను హుడాలోని నాలాకు అనుసంధానం చేసి వ్యర్థాలను వదులుతున్నారని స్థానికులు తీవ్ర ఆందోళన చేపట్టారు.
ప్రధానంగా పెద్ద పెద్ద లేఅవుట్ లోని (Huda Layout) వ్యర్థాలు, మరికొన్ని చోట్ల నుంచి మెడికల్ వ్యర్థాలను తీసుకొచ్చి హుడా రోడ్డుపక్కన ఇష్టమోచ్చినట్లు అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు. అయితే.. దీన్ని సమీపంలో ఉన్న సాయిగ్రీన్ మిడోస్ అపార్ట్ మెంట్ (Sai green meadows) వాసులు తీవ్రంగా స్పందించారు. ఇతర అపార్ట్ మెంట్ ల నుంచి వచ్చే వ్యర్థాలు, మెడికల్ వెస్టేజ్ వలన తమ ఇంట్లోని పసిపిల్లలు, వయో వృద్ధులు తరచుగా అనారోగ్యాల బారిన పడుతున్నారని సాయిగ్రీన్ మిడోస్ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా.. తమ అపార్ట్ మెంట్ కు తాగు నీటిని సరఫరా చేసే బోర్ కు సమీపంలో, నాలా ఉండటం వలన అండర్ గ్రౌండ్ నుంచి బోరు బావితో నీరు కలుస్తుందని కూడా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఈ నీటిని తాగుతున్న పలువురు కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యాలకు గురౌతున్నారంటూ కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా, గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ ప్రకారం.. అపార్ట్ మెంట్ కు సరఫరా అవుతున్న బోరు నీటితో... నాలా లోని కలుషితమైన నీరు చేరుతున్నట్లు తెలింది.
అయితే.. ఈ నీరు తాగడానికి కానీ, మరే ఇతర అవసరాలకు గానీ ఉపయోగించడం ఆరోగ్యానికి తీవ్రమైన హని కల్గిస్తుందని రిపోర్ట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టు ఎన్నిసార్లు తిరిగిన తగినంత స్పందన కరువైందని కాలనీ వాసులు చెప్పారు.
తమ అపార్ట్ మెంట్ లో దాదాపు.. 35 కుటుంబాలకు ఉంటున్నాయని, తమ చుట్టుపక్కల వీధి దీపాలను కూడా కొందరు నాయకులు, అధికారుల సహాకారంతో పాటు, తాము సొంతంగా డబ్బులు సమకూర్చుకుని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికైన జీహెచ్ ఎంసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపించి తమ సమస్యను పెద్ద మనసుతో పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీహెచ్ఈఎల్ మాజీ ఎంప్లాయిస్ సీనియర్ నేత జలంధర్, శంకర్ చేతన్, అమర్ , రాజు, రవి, సాయిగ్రీన్ మిడోస్ అపార్ట్ మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GHMC, Health issues, Local News, Pollution, Telangana