Home /News /telangana /

HYDERABAD TELANGANA HIGH COURT UNHAPPY WITH CORONA VIRUS SITUATION IN STATE QUESTIONS GOVERNMENT AK

Telangana: కరోనా కట్టడిపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు 10 ప్రశ్నలు.. వీటిపై సమాధానం చెప్పాలంటూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు పది ప్రశ్నలు సంధించింది.

    కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వానికి పది ప్రశ్నలు సంధించింది. వీటికి వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశించింది. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోందని పేర్కొన్న ప్రభుత్వం.. నైట్ కర్ఫ్యూతో కేసులు తగ్గాయని తెలిపింది. అయితే కేసులు ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్టు ప్రశ్నించింది. పగటి వేళల్లో పబ్లిక్ ప్లేస్, బార్ అండ్ రెస్టారెంట్, థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

    కుంభమేళా నుంచి వచ్చినవారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్‌లో పెడుతున్నాయని.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ సరిహద్దుల వద్ద చర్యలపై వివరించాలని హైకోర్టు కోరింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టులు 24 గంటల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెమిడెసివర్ రాష్ట్రంలోనే తయారవుతున్నా కొరత ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీసింది. వెబ్ పోర్టల్‌లో కోవిడ్ సెంటర్ వివరాలు ఎందుకు లేవని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

    వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని అడిగింది. మూడు రోజుల్లోనే ఆక్సిజన్ కొరత ఎలా ఏర్పడిందని హైకోర్టు ప్రశ్నించింది. అసలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతమందికి అంత్యక్రియులు జరుగుతున్నాయో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రశ్నలకు మధ్యాహ్నం రెండున్నర గంటల్లోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Telangana, Telangana High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు