Home /News /telangana /

HYDERABAD TELANGANA HIGH COURT SERIOUS FOR NOT TAKING CONTROL MEASURES OF COVID 19 SITUATION IN STATE AK

Telangana: ప్రాణాలను పట్టించుకోరా ?.. పబ్‌లు, మద్యం దుకాణాలే ముఖ్యమా ? తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana High Court: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మరోసారి తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టింది.

    కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే కీలక నిర్ణయాలు ఇంకెప్పుడు తీసుకుంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా లేదా తమనే ఆదేశాలు ఇవ్వమంటారా అని హెచ్చరించింది. జనసంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మరోసారి తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఇవ్వడంలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

    థియేటర్లు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే ప్రభుత్వానికి ముఖ్యమా ? అని వ్యాఖ్యానించింది అయితే జనసంచారం నియంత్రణకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో మధ్యాహ్నంలోగా హైకోర్టుకు నివేదించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి అధికారులు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 4,009 కేసులు నమోదయ్యాయని, 14 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Covid-19, Telangana, Telangana High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు