HYDERABAD TELANGANA HIGH COURT SAYS TRAFFIC POLICE CANNOT SEIZE VEHICLES SU
Traffic Challan: పెండింగ్ చలాన్లు ఉన్న వాహనం సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉందా..? హైకోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి..
ప్రతీకాత్మక చిత్రం
పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల కనబడితే ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తారనే భయం వాహనదారులకు వెంటాడుతోంది. ఇటీవల ఒక చలానా పెండింగ్‌లో ఉందని కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేయడం వాహనదారుల్లో సరికొత్త టెన్షన్‌కు కారణమైంది.
పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల కనబడితే ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తారనే భయం వాహనదారులకు వెంటాడుతోంది. ఇటీవల ఒక చలానా పెండింగ్‌లో ఉందని కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేయడం వాహనదారుల్లో సరికొత్త టెన్షన్‌కు కారణమైంది. మరోవైపు ఒక్క చలానా ఉన్న వాహనం సీజ్ చేయవచ్చని ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి చెప్పినట్టుగా వార్తలు రావడం వాహనదారుల ఆందోళనను మరింతగా పెంచింది. ఈ క్రమంలోనే వాహనదారులు రోడ్డుపైకి రావాలంటే భయపడిపోతున్నారు. తమ వాహనంపై గతంలో ఏమైనా చలానాలు ఉన్నాయో..? లేదో.. అంటూ చెక్ చేసుకుంటున్నారు. అయితే పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాన్ని సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉందా అని కొందరు వాహనదారులు ఆరా తీస్తున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు కొద్ది రోజుల కిందట జారీచేసిన మార్గదర్శకాలు ఇప్పుడు వాహనదారులకు ఊరట కలిగించేలా ఉన్నాయి.
కూకట్పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్ తొగరి బైకును ఆగస్టు 1వ తేదీన పర్వత్‌నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆ బైకుపై రూ.1650 చలానా పెండింగ్ ఉందని.. ఆ మొత్తం చెల్లించాలని ఎస్ఐ మహేంద్రనాథ్ కోరారు. అయితే చలనా కట్టేందుకు న్యాయవాది నిరాకరించారు. దీంతో పోలీసులు బైక్‌ను సీజ్ చేశారు. అయితే ఒక్క చలానాకే బైక్ చేస్తారా.. న్యాయవాది పోలీసులను ప్రశ్నించారు. అయితే ట్రాఫిక్ పోలీసులు మాత్రం రూల్స్ ప్రకారమే బైక్ సీజ్ చేశామని తెలిపారు. ఈ క్రమంలోనే న్యాయవాది నిఖిలేష్.. చలానా ఎందుకోసం వేశారు అని పోలీసులను ప్రశ్నించగా.. ప్రవేశం లేని పైవంతెనపై ప్రయాణించారని.. అందుకే రూ. 1635 చలాన విధించినట్టు చెప్పారు.
అయితే దీంతో న్యాయవాది నిఖిలేష్ షాక్ తిన్నారు. నో ఎంట్రీకి రూ. 135 చలానా వేయాల్సి ఉందని.. ఇంత మొత్తం ఎందుకు ఫైన్ వేశారని ట్రాఫిక్ పోలీసులను అడిగారు. ఈ ఘటనతో న్యాయవాది నిఖిలేష్.. తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఎక్కువ మొత్తంలో జరిమానా విధించిన పోలీసులు.. ఒక్క చలానాకే బైక్ సీజ్ చేయడంతో అతను తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఆగస్టు 11న విచారణ జరిగిన హైకోర్టు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం వాహనం సీజ్ చేయకూడదని తెలిపింది. బైక్ తిరిగి ఇచ్చేయాలని చెప్పడంతో.. ట్రాఫిక్ పోలీసులు నిఖిలేష్‌కు బైక్‌ను తిరిగి ఇచ్చేశారు.
చట్ట ప్రకారం వాహనాలను సీజ్ చేయకూడదని హైకోర్టు చెప్పడం వాహనదారులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. అయితే హైకోర్టు ఆదేశాలు క్లియర్‌గా ఉన్నప్పటికీ.. కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు వెలుగుచూస్తునే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.