HYDERABAD TELANGANA HIGH COURT HAS GIVEN DIRECTION TO GOVERNMENT OVER COVID RESTRICTIONS AND RTPCR TESTS PRV
Telangana high court: తెలంగాణలో కరోనా ఉధృతిపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి ఏం ఆదేశాలు ఇచ్చిందంటే..
ts high court
దేశంలో ఒమిక్రాన్ తాండవిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) కూడా పకడ్భందీ చర్యలు చేపట్టింది. అయినా కూడా తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సోమవారం నాడు మరోసారి హైకోర్టు (High court)లో విచారణ జరిపింది
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కారణంగా కరోనా ఉధృతి పెరిగింది. గతంలో వేలల్లోనే ఉన్న కేసులు ఇపుడు లక్షలుగా నమోదవుతున్నాయి. రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ కోరలు చాస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర (Maharashtra) తదితర రాష్ట్రాల్లో ఒమిక్రాన్ తాండవిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) కూడా పకడ్భందీ చర్యలు చేపట్టింది. అయినా కూడా తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సోమవారం నాడు మరోసారి హైకోర్టు (High court)లో విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు (RTPCR tests) చేయాలని హైకోర్టు సూచించింది .
ఆర్టీపీసీఆర్ (RTPCR), ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. భౌతికదూరం (Social distance), మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. కరోనా వ్యాప్తి (Corona spreading) నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని ప్రభుత్వానికి హైకోర్టు గుర్తుచేసింది . కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ (Advocate general) వెల్లడించారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.
కొత్తగా 2,047 కేసులు..
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజూకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..కొత్తగా 2,047 పాజిటివ్ కేసులు(Corona cases in Telangana) నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. వైరస్ తో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,057కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,013 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ 1174 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో తాజాగా 1,53,699 మందికి కొవిడ్ టీకాల (Vaccination) పంపిణీ చేశారు.
హైకోర్టులో రేపట్నుంచి వర్చువల్ (Virtual)గా కేసుల విచారణ.. ఆన్లైన్లోనే పూర్తిస్థాయి విచారణలు చేపట్టనున్నట్లు తెలిపింది. కొవిడ్ వ్యాప్తి వల్ల మళ్లీ వర్చువల్ విచారణలు జరపనున్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 25 కు హైకోర్టు వాయిదా వేసింది . ఈనెల 12 వరకు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు (Medical health officials) హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఈనెల 12 వరకు మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 6.95 పాజిటివిటీ రేటు (Positivity rate) నమోదైంది. అలాగే జీహెచ్ఎంసీ (GHMC)లో 5.65 శాతం పాజిటివిటీ రేటు ఉన్నట్లు అధికారులు తమ రిపోర్టులో కోర్టుకు నివేదించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.