• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD TELANGANA HIGH COURT COMMENTS ON NIGHT CURFEW AND WEEK END LOCKDOWN ORDERS TO STATE GOVERNMENT AK

Telangana: కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Telangana: కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

ప్రతీకాత్మక చిత్రం

Telangana: 48 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ, వీకెండ్ దీనిపై నిర్ణయం తీసుకోకపోతే తామే ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది.

  • Share this:
    తెలంగాణలో కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. 48 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోకపోతే తామే ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో నిర్ణయం తీసుకోకపోతే తామే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, హెల్త్ డైరెక్టర్ విచారణకు హాజరయ్యారు. రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చూడాలని సూచించింది. జీహెచ్ఎంసీలో వార్డుల వారీగా నమోదైన కేసుల వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. పెళ్లిళ్లు, శుభకార్యాలపై నిబంధనలు పెట్టాలని స్పష్టం చేసింది. డీజీపీ, హెల్త్ అధికారులు కోర్టుకు ఇచ్చిన నివేదిక తప్పులతడకగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై 22న స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలన్న హైకోర్టు.. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

    అంతకుముందు ఇదే అంశంపై ఈ రోజు ఉదయం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సీరియస్ అయ్యింది. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే కీలక నిర్ణయాలు ఇంకెప్పుడు తీసుకుంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా లేదా తమనే ఆదేశాలు ఇవ్వమంటారా అని హెచ్చరించింది. జనసంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మరోసారి తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఇవ్వడంలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. థియేటర్లు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే ప్రభుత్వానికి ముఖ్యమా ? అని వ్యాఖ్యానించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు