రేపటి నుంచి రాష్ట్రంలో జ్వర సర్వే (Fever Survey) ప్రారంభం అవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Telangana health minister harish rao) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనా (Corona) నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని తెలిపారని వెల్లడించారు. జ్వర సర్వే కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు.
ఆరోగ్య సిబ్బందికి తోడు మున్సిపల్, పంచాయతీ అధికారులు ఇందులో పాల్గొంటారు. ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తారు. లక్షణాలు (Symptoms) ఉన్నవారికి హోం ఐసోలేషన్ కిట్లు ఇస్తారు. వారి ఆరోగ్యాన్ని రోజు వారి మానిటర్ చేస్తారు. అవసరం అయితే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తారు. మనం నిర్వహించిన జ్వర సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచింది. నీతి అయోగ్ (Niti ayog) కూడా బెస్ట్ ప్రాక్టీస్ అని ప్రశంసించింది. 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు సమకూర్చుకున్నాం. వీటిని పి హెచ్ సి స్థాయి పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉంది ”అన్నారు.
అన్ని బస్తీ దవాఖానల్లో టెస్టింగ్, కిట్ల పంపిణీ..
జ్వర సర్వే కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి అన్నారు. ‘‘ ప్రతి ఇంటా పరీక్షలు నిర్వహించి, ముందస్తుగా వ్యాధి లక్షణాలను గుర్తించి, సకాలంలో చికిత్స మొదలు పెడదాం. ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తి ఎక్కువ ఉన్నా.. తీవ్రత తక్కువగా ఉంది. అలా అని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానల్లో టెస్టింగ్, కిట్ల పంపిణీ ఉంటుంది. కరోనా తగ్గే వరకు ఆదివారం 2 గంటల వరకు అన్ని బస్తీ దవాఖానలు సేవలు అందిస్తాయి”. అన్నారు.
Hon’ble @TelanganaCMO Garu’s conviction towards Telangana’s #Covidmanagement strategy receives appreciation from Government of India and @nitiaayog for being able to save most lives during the pandemic and for enabling best practices for home based #COVID19 treatment. pic.twitter.com/pztUnQcAeF
— Harish Rao Thanneeru (@trsharish) January 20, 2022
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ పట్ల కేంద్రం, నీతీ ఆయోగ్ నుంచి ప్రశంసలు అందాయని హరీశ్ రావు ట్విటర్లో తెలిపారు. ఈ మేరకు హరీశ్ ట్విటర్లో.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఎక్కువ మంది ప్రాణాలను రక్షించగలిగినందుకు, కోవిడ్ చికిత్స కోసం ఉత్తమ పద్దతులను అనుసరించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం, నీతీ ఆయోగ్ ప్రశంసలు దక్కాయి” అని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Rao, Health minister, Telangana