హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ramzan: ముస్లీం ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్.. !

Ramzan: ముస్లీం ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్.. !

ముస్లీం ఉద్యోగులకు గుడ్ న్యూస్

ముస్లీం ఉద్యోగులకు గుడ్ న్యూస్

Ramzan: ముస్లీం ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్.. !

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ముస్లీం ప్రభుత్వ ఉద్యోగులు/కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్/బోర్డులు/ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త అందించింది. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా అందరూ ప్రార్థనలు చేసేందుకు కార్యాలయాలు/పాఠశాలల నుంచి గంట ముందుగా బయటకు వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు అమల్లో ఉంటాయి. టీఎస్‌-ఎంఎస్‌ సెంట్రల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

పవిత్ర రంజాన్ నెలలో ముందుగా బయలుదేరడానికి అనుమతి  ఇచ్చింది సర్కార్. ఉద్యోగులకు గంటపాటు మినహాయింపు ఇచ్చారు. తద్వారా ముస్లింలు సూర్యాస్తమయం తర్వాత తమ ఆచారాలను నిర్వహించుకోగలుగుతారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముస్లిం ఉద్యోగులు స్వాగతించారు. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఎక్కువ మంది ముస్లింలు పగటిపూట ఉపవాసం ఉంటారు. కఠిన ఉపవాస దీక్షను పాటిస్తారు.  రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటలుపాటు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారు.

First published:

Tags: CM KCR, Local News, Ramzan, Ramzan 2023

ఉత్తమ కథలు