బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న నిందితుల పిటీషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం సర్కార్ కు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఇప్పటివరకు దర్యాప్తు చేసిన సిట్ ను రద్దు చేస్తూ సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సర్కార్ సవాల్ చేస్తూ సర్కార్ అప్పీల్ కు వెళ్ళింది. ప్రభుత్వ అప్పీల్ పై సీజే ఉజ్జల్ భుయాన్ విచారణ జరపనున్నారు. రేపు దీనిపై ధర్మాసనం విచారణ జరపనున్నట్టు తెలుస్తుంది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సిట్ దర్యాప్తు నిలిపేయాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక తాజాగా హైకోర్టు తీర్పు కాపీ సీబీఐకి చేరింది. 98 పేజీలతో కూడిన ఈ తీర్పు కాపీలో కోర్టు కీలక విషయాలు ప్రస్తావించింది. ఈ కేసు సిట్ నుండి సీబీఐకి అప్పగించడానికి మొత్తం 45 కారణాలను కోర్టు పేర్కొంది. ఇక ఆర్డర్ కాపీ సీబీఐకి చేరడంతో రానున్న రోజుల్లో కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఈ కేసుకు సంబంధించి సీబీఐ నెక్స్ట్ ఎవరిని విచారిస్తుంది? ఎలా ముందుకెళ్లబోతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ ఎంట్రీతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సిట్ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సీబీఐకి అప్పగించాల్సి ఉంటుంది. వీడియోలకు సంబంధించి పెన్ డ్రైవ్ లు, మ్యానువల్ పేపర్స్ సహా మిగతా అన్ని వివరాలు సీబీఐకి హ్యాండోవర్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ విచారణ జరిగే వరకు సీబీఐ ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.
మరి ప్రభుత్వ అప్పీల్ పై ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇస్తుందా లేక సిట్ నే దర్యాప్తు చేయాలని ఆదేశిస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana, TRS MLAs Poaching Case