• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD TELANGANA GOVERNMENT STANDS FOR WELFARE OF DIFFERENTLY ABLED PERSONS VS

దివ్యాంగులకు ఉద్యోగాల్లో 4 శాతం, డబుల్ ఇళ్లలో 5 శాతం : కేటిఆర్

దివ్యాంగులకు ఉద్యోగాల్లో 4 శాతం, డబుల్ ఇళ్లలో 5 శాతం : కేటిఆర్

రాష్ట్ర్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో దివ్వాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని మంత్రి కేటిఆర్ ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లలో అయిదు కేటాయించే విధంగా అన్ని జిల్లాల్లో చర్యలు చేపడతామని ఆయన హామి ఇచ్చారు.

రాష్ట్ర్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో దివ్వాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని మంత్రి కేటిఆర్ ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లలో అయిదు కేటాయించే విధంగా అన్ని జిల్లాల్లో చర్యలు చేపడతామని ఆయన హామి ఇచ్చారు.

  • Share this:
రాష్ట్ర్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో దివ్వాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని మంత్రి కేటిఆర్ ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లలో అయిదు కేటాయించే విధంగా అన్ని జిల్లాల్లో చర్యలు చేపడతామని ఆయన హామి ఇచ్చారు. అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణి కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో నిర్వహించగా ముఖ్యఅతిధిగా మంత్రి కేటిఆర్ పాల్గోన్నారు.

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణి

వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చాలా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని తెలిపారు. దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా తెలంగాణ‌లో దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏ రాష్ర్టంలో చేయ‌ని విధంగా.. రూ. 24 కోట్ల 38 ల‌క్ష‌ల‌తో 16,600 మంది దివ్యాంగుల‌కు ఉచితంగా స‌హాయ ప‌రిక‌రాలు పంపిణీ చేయ‌డం సంతోషాన్నిస్తుంద‌న్నారు.

ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు 

నాలుగైదు నెల‌ల కింద‌ట దివ్యాంగుల స‌మ‌స్య‌ల ప‌ట్ల స‌మావేశం నిర్వ‌హించి కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు రూపొందించాల‌ని చాలెంజ్ చేయ‌డం జ‌రిగిందని. అందులోని ఆవిష్క‌ర‌ణ‌ల‌ను కొన్నింటిని ఇవాళ దివ్యాంగుల‌కు అందిస్తున్నామ‌ని తెలిపారు. మరోవైపు గ‌తంలో దివ్యాంగుల‌కు పెన్ష‌న్ల కింద రూ. 500 ఇస్తే.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ. 3016 ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌లో కూడా 5 శాతం ఇండ్ల‌ను దివ్యాంగుల‌కు కేటాయిస్తున్నామ‌ని తెలిపారు. ఈ నిబంధ‌న అన్ని జిల్లాల్లో అమ‌ల‌య్యే విధంగా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశామ‌న్నారు. రాష్ర్ట ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌కాల్లో 4 శాతం రిజర్వేష‌న్ల‌ను దివ్యాంగుల కోసం అమ‌లు చేస్తామ‌న్నారు. దివ్యాంగుల స‌మ‌స్య‌ల‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కారిస్తామ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

సాటి మనిషిని ఆదుకున్నప్పుడే జీవితానికి సార్థకత 

సాటి మ‌నిషి క‌ష్టం, బాధ అర్థం చేసుకుని వారి క‌ష్టంలో తోడున్న‌ప్పుడే మానవ జ‌న్మ‌కు సార్థ‌క‌త ఉంటుంద‌ని దివ్యాంగుల‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మాట సీఎం కేసీఆర్ త‌మ‌కు ఎప్పుడూ చెప్తుంటారు. పేద‌రికంలో ఉండే పేద‌లు కానీ, ఇత‌ర శారీర‌క‌మైన ఇబ్బందులు ఉండే దివ్యాంగుల‌కు బాస‌ట‌గా, ఆస‌రాగా నిల‌బ‌డాల‌న్న‌దే టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ముఖ్య ఉద్దేశ‌మ‌ని కేటీఆర్ ఉద్ఘాటించారు.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు