హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana-Google: గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం.. వారికి ప్రయోజనాలను చేకూర్చేందుకే ఇలా..

Telangana-Google: గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం.. వారికి ప్రయోజనాలను చేకూర్చేందుకే ఇలా..

ఒప్పంద కార్యక్రమంలోని దృశ్యం

ఒప్పంద కార్యక్రమంలోని దృశ్యం

రాష్ట్ర యువత, మహిళా పారిశ్రామికవేత్తలకు ఎకానమీ ప్రయోజనాలను ఆఫర్ చేసేందుకు గూగుల్ గురువారం తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (Memorandum of Understanding)పై సంతకం చేసింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో ఎంఓయూ (MoU) కుదిరింది.

ఇంకా చదవండి ...

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రజలకు తమ ప్రోగ్రామ్స్ ద్వారా బెనిఫిట్స్ అందించేందుకు టెక్ దిగ్గజం గూగుల్ (Google) సిద్ధమైంది. రాష్ట్ర యువత, మహిళా పారిశ్రామికవేత్తలకు ఎకానమీ ప్రయోజనాలను ఆఫర్ చేసేందుకు గూగుల్ గురువారం తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (Memorandum of Understanding)పై సంతకం చేసింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో ఎంఓయూ (MoU) కుదిరింది. గూగుల్(Google) సంస్థ హైదరాబాద్‌లోని (Hyderabad) గచ్చిబౌలిలో ఏకంగా 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మించడం ప్రారంభించింది. ఈ క్యాంపస్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అమెరికాలో కాకుండా బయట ఇంత పెద్ద క్యాంపస్ నిర్మించడం గూగుల్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.

"సుస్థిరత (Sustainability)తో 3.3 మిలియన్ చదరపు అడుగుల ఎనర్జీ ఎఫిషియన్సీతో నిర్మించే గూగుల్ క్యాంపస్ దశాబ్దాల పాటు హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుంది. రాష్ట్రానికి నిరంతరం సపోర్ట్ చేస్తున్న గూగుల్‌కు ధన్యవాదాలు" అని కేటీఆర్ ట్వీట్ చేశారు. గూగుల్ ప్రకారం, ఆన్‌సైట్‌లో జరిగిన వేడుకలో కేటీఆర్ భవనం డిజైన్‌ను ఆవిష్కరించారు. ఈ భారీ గూగుల్ బిల్డింగ్ డిజైన్ ఎనర్జీ ఎఫిషియన్సీతో పాటు సుస్థిరతకు ప్రాధాన్యతనిస్తుంది.

ఇది చదవండి: ఏపీ టెన్త్ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. 12 మంది టీచర్ల అరెస్ట్..


కొత్త ఒప్పందం ప్రకారం, తెలంగాణ యువతకు గూగుల్ కెరీర్ సర్టిఫికేట్‌ల కోసం స్కాలర్‌షిప్‌లను ఆ సంస్థ ఆఫర్ చేయనుంది. డిజిటల్, వ్యాపార, ఆర్థిక నైపుణ్యాల శిక్షణ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వనుంది. డిజిటల్ టీచింగ్, లెర్నింగ్ టూల్స్ & సొల్యూషన్లతో ప్రభుత్వ పాఠశాలల మోడ్రనైజేషన్ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి కూడా గూగుల్ తన వివిధ బ్రాంచెస్ ద్వారా ప్రభుత్వంతో సహకరిస్తుంది. ప్రజా రవాణాను మెరుగుపరచడానికి, వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీల వినియోగాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కూడా గూగుల్ మద్దతు ఇస్తుంది.

ఎంఓయూపై సంతకం చేసిన అనంతరం రామారావు మాట్లాడుతూ... తెలంగాణ, గూగుల్ చాలా కాలంగా మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. "గూగుల్ తెలంగాణ రాష్ట్ర వృద్ధికి, సాంకేతికతకు, ఐటీ రంగానికి మద్దతునిస్తూనే ఉంది. అగ్రగామి గూగుల్ వల్ల నగరం ఇమేజ్‌ పూర్తిగా మారిపోయింది’’ అని ఆయన అన్నారు. "ఈరోజు గచ్చిబౌలిలోని 7.3 ఎకరాల కొత్త క్యాంపస్ ద్వారా గూగుల్ తన హైదరాబాద్ కనెక్షన్‌ని, హైదరాబాద్‌లో దాని మూలాలను మరింతగా పెంచుకుంటుందని చెప్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మేం కొత్త భవనం కోసం డిజైన్‌ను ఇప్పుడే ఆవిష్కరించాం. కాంక్రీట్ పోయడం (Ceremonial Concrete Pouring) కూడా చేశాం," అని చెప్పారు. ఈ కొత్త ఎంఓయూ ద్వారా యువత, మహిళలు, విద్యార్థులు వంటి సంఘాలు, పౌరసేవల్లో దశలవారీ మార్పు తీసుకురావడంపై తెలంగాణ, ప్రభుత్వం దృష్టి సారిస్తున్నాయి.

Solar Eclipse: మరికొన్ని గంటల్లో ఏర్పడనున్న సూర్యగ్రహణం.. ఎక్కడెక్కడ కనిపించనుందో తెలుసా..?


కంట్రీ హెడ్, గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, సంజయ్ గుప్తా మాట్లాడుతూ... "గత కొన్ని సంవత్సరాలుగా, రాష్ట్రంలోని ప్రజల అవసరాలను తీర్చడానికి, గూగుల్ టెక్నాలజీలు, ప్రోగ్రామ్స్ ప్రయోజనాలను తీసుకురావడానికి మేం తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగి ఉన్నాం." అని పేర్కొన్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Google, KTR, Telangana

ఉత్తమ కథలు