HYDERABAD TELANGANA GOVERNMENT IS BRINGING ANTONOX TECHNOLOGY TO PREVENT PAIN IN PREGNANT WOMEN SNR
Telangana:ఆ గ్యాస్ పీలిస్తే చాలు..గర్భిణులకు పురిటి నొప్పుల బాధ ఉండదు
(ప్రతీకాాత్మకచిత్రం)
Telangana:గర్భిణులు ప్రసవం సమయంలో నొప్పులు పడే బాధ లేకుండా చేస్తోంది తెలంగాణ సర్కారు. ఇందుకోసం మత్తు లాంటి వాయువును ముక్కు, నోటి ద్వారా అందించి ఉపశమనం కలిగించేందుకు ఎంటోనాక్స్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ఆసుపత్రుల్లో అమలు చేయనుంది.
ఇకపై ప్రసవం సమయంలో గర్భిణులు నొప్పులు పడాల్సిన అవసరం లేదు. నిజమే ఎలాంటి నొప్పులు పడకుండా సాధారణ ప్రసవంతోనే బిడ్డను కనవచ్చు. ఆదిశగానే తెలంగాణ(Telangana)సర్కారు అడుగులు వేస్తోంది. ఇందుకోసం అత్యవసర వైద్యసేవలు, ఆరోగ్య పరికరాలను ఏర్పాటు చేసింది అతిత్వరలోనే రాష్ట్రంలోని గర్భిణిలకు అందుబాటులోకి తేనుంది. ప్రస్తుత కాలంలో నార్మల్ డెలివరీలు అరుదుగా జరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువగా సిజేరియన్(Cesarean)లు జరుగుతుండటంతో ప్రభుత్వం ఆ సమస్యకు సొల్యూషన్ కనుగొంది. నార్మల్ డెలివరీ(Normal delivery)లు పెంచాలన్న ఆలోచనతో ఎంటోనాక్స్ టెక్నాలజీ(Antonox technology)ని ఉపయోగించి గర్భిణు(pregnant women)లకు ప్రసవం సమయంలో నొప్పులు రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం గర్భిణికులకు ప్రసవం సమయంలో నెట్రస్ ఆక్సైడ్Nitrous oxide, ఆక్సిజన్(oxygen)మిశ్రమాన్నిమాస్క్(Mask)ల ద్వారా లేదా మౌత్ పీస్( Mouthpiece)ద్వారా అందించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఈవిధంగా నైట్రస్ ఆక్సైడ్ వాయువును పీల్చిన 15-20సెకన్లలో పని చేయడం మొదలవుతుంది. ఐదు నిమిషాల వరకు పురిటి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈవిధంగా గర్భిణులకు నొప్పులు వచ్చినప్పుడల్లా నైట్రస్ ఆక్సైడ్ మిశ్రమాన్ని పీలిస్తే సరిపోతుంది. ఒకరకంగా ఇది గర్భిణులకు మత్తు(Intoxication), పెయిన్ కిల్లర్(Pain killer)కోసం ఇచ్చే డ్రగ్‌గా పనిచేస్తుంది.
నొప్పులు లేకుండానే ప్రసవం..
రాష్ట్రంలోని గర్భిణులకు ఈ తరహా వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆసుపత్రిలో పైలెట్ ప్రాజెక్ట్ చేపడుతోంది. ఇక్కడ మొదటగా గర్భిణులకు గ్యాస్ ఇచ్చేందుకు అవసరమయ్యే పరికరాలు, గ్యాస్ సిలిండర్లను సిద్దంగా ఉంచింది. రెండు, మూడ్రోజుల్లో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రస్తుతం దేశంలోని కొన్ని పెద్దాసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీ కోఠి ఆసుపత్రిలో సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రిలో అమల్లోకి తెస్తామని రాష్ట్ర వైద్యశాఖ అధికారులు తెలియజేశారు.
పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే..
ఎంటోనాక్స్ టెక్నాలజీని అనుసరించి గర్భిణికి నొప్పి వచ్చినప్పుడల్లా గ్యాస్ ఎంత పీల్చాలి ? ఎప్పుడు పీల్చాలనే విషయంపై గర్భిణులకు డాక్టర్లు, గైనకాలజిస్ట్లు సూచనలు చేస్తారు. అయితే ఈ వాయివును గర్భిణులు ఎక్కువ మోతాదులో పీల్చినా, తక్కువ మోతాదులో ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు డాక్టర్లు. ఈ మెడిసిన్ ద్వారా తల్లికి, బిడ్డకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటున్నారు. గర్భంతో ఉన్న మహిళలు పడే నొప్పుల బాధతోనే ఎక్కువ మంది సిజేరియన్లకు మొగ్గు చూపుతారు. ఆసమస్యకు చెక్ పెట్టి..నార్మల్ డెలవరీల సంఖ్య పెంచాలనే ప్రభుత్వం ఈతరహా టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.