జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం హానరింగ్ విమెన్ ఇన్ జర్నలిజం(Honoring Women in Journalism) పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వించింది. హైదరాబాద్(Hyderabad) పీపుల్స్ ప్లాజాలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాత్రికేయ వృత్తిలో విశేష సేవలందించిన మహిళా జర్నలిస్ట్‌లను మంత్రులు కేటీఆర్(KTR), సబితా ఇంద్రారెడ్డి,సత్యవతి రాథోడ్ అవార్డులతో సన్మానించారు. ముఖ్యంగా నెట్‌వర్క్ 18లో పనిచేస్తున్న నలుగురు మహిళా జర్నలిస్ట్‌లైన సుల్తానా బేగం(Sultana Begum), కోకలి ముఖర్జీ(Kokali Mukherjee), హీన జుబేర్ సిద్దిఖీ(Heena Zubair Siddiqui), స్వస్తికా దాస్ (Swastika Das)అనే నలుగురికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ అవార్డులు అందజేశారు. మహిళలుగా ఉంటూ జర్నలిజంలో విలువలతో కూడిన పాత్ర పోషిస్తున్నందున అభినందించారు.
నలుగురికి అవార్డులు..
పాత్రికేయవృత్తిలో విలువలతో కూడిన వార్తలను సేకరించడం, సమాజానికి మేలు కలిగించే వార్తలను అందించడంలో ప్రతిభ కనబర్చిన మహిళా జర్నలిస్ట్‌లకు తెలంగాణ ప్రభుత్వం జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డులతో సన్మానించింది. ఇందులో నెట్‌వర్క్ 18లో పని చేస్తున్న మహిళా జర్నలిస్ట్ సుల్తానాబేగంను అవార్డుతో సన్మానించింది తెలంగాణ ప్రభుత్వం. సుల్తానాబేగం 14ఏళ్లుగా వేర్వేరు న్యూస్ చానల్స్‌లో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం నెట్‌వర్క్18 తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
జర్నలిజంలో 20ఏళ్ల అనుభవం..
హీన జుబేర్ సిద్దిఖీ అనే మరో నెట్‌వర్క్ 18 జర్నలిస్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం హానరింగ్ విమెన్ ఇన్ జర్నలిజం అవార్డును అందజేసింది. ఉర్ధు న్యూస్ ఛానల్‌లో సీనియర్ యాంకర్‌గా విధులు నిర్వహిస్తున్న హీనా జర్నలిజంలో సుమారు 20ఏళ్ల అనుభవం కలిగి ఉన్నారు.
మహిళా దినోత్సవ పురస్కారాలు..
ఇక కోకలి ముఖర్జీ అనే మరో నెట్‌వర్క్ 18 జర్నలిస్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం విశిష్టమైన పురస్కారంతో సన్మానించింది. కోకలి ముఖర్జీ అలిఘర్ ముస్లిం యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ ముగ్గురు నెట్‌వర్క్ 18 జర్నలిస్ట్‌లు తెలంగాణ చీఫ్ సెక్రట్రీ శాంతికుమారి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
తెలుగు న్యూస్ బ్యూరో..
ఇక నెట్‌వర్క్18లో ఆంధ్రా, తెలంగాణ బ్యూరోగా పని చేస్తున్న స్వస్తికా దాస్‌కు తెలంగాణ ప్రభుత్వం హానరింగ్ జర్నలిజం అవార్డుతో సత్కరించింది.నెట్‌వర్క్ 18లో సీనియర్ జర్నలిస్ట్‌గా ఉన్న స్వస్తికా దాస్ సీనియర్ కాపీ ఎడిటర్ నుంచి రిపోర్టింగ్‌లో మారారు. 2016నుంచి నెట్‌వర్క్ 18లో పని చేస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి న్యూస్ బ్యూరోగా ఉన్నారు. గతంలో సీఎన్ఎన్-న్యూస్18 సీనియర్ కరస్పాండెంట్‌గా పని చేశారు.
పాజిటివ్ న్యూస్ అవసరం..
విధి నిర్వాహణలో మహిళా జర్నలిస్ట్‌లు ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొంటున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అక్రిడేటెడ్ జర్నలిస్టులకు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి వారికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.రాష్ట్రంలో 19వేల జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జర్నలిస్టులు ఇచ్చినట్లుగా ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళా జర్నలిస్టులంతా ఏకమై మహిళా జర్నలిస్ట్ యూనియన్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈసందర్భంగా పాత్రికేయవృత్తిలో సేవలందిస్తున్న మహిళా జర్నలిస్ట్‌లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. వారి సేవల్ని కొనియాడారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minister ktr, Telangana News, Women's day