హోమ్ /వార్తలు /తెలంగాణ /

Urban Farming : ఇంటి మిద్దెలు, బాల్కనీలోనే కూరగాయల సాగు .. ప్రతి నాల్గో ఆదివారంట్రైనింగ్‌ ..ఎక్కడిస్తారంటే ..

Urban Farming : ఇంటి మిద్దెలు, బాల్కనీలోనే కూరగాయల సాగు .. ప్రతి నాల్గో ఆదివారంట్రైనింగ్‌ ..ఎక్కడిస్తారంటే ..

Terraces Garden Urban Farming

Terraces Garden Urban Farming

Urban Farming:హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలో ఉండే నగర ప్రజలకు తెలంగాణ ఉద్యానశాఖ మంచి అవకాశం కల్పిస్తోంది. టెర్రస్, బాల్కనీలు, అప్‌ స్టైర్‌లలో కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలు పెంచాలనే ఆసక్తి కలిగిన వారి కోసం అర్బన్‌ ఫామింగ్ అనే పథకం ప్రవేశపెట్టింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌ (Hyderabad)జంటనగరాల పరిధిలో ఉండే నగర ప్రజలకు తెలంగాణ ఉద్యానశాఖ మంచి అవకాశం కల్పిస్తోంది. టెర్రస్(Terrace), బాల్కనీలు(Balconies), అప్‌ స్టైర్‌(Upstairs)లలో కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలు పెంచాలనే ఆసక్తి కలిగిన వారిని ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం అర్బన్‌ ఫామింగ్(Urban Farming)అనే పథకం ప్రవేశపెట్టింది. దీని ద్వారా హైదరాబాద్‌లో ప్రతి నెల నాల్గవ ఆదివారం మిద్దె తోటలను ఎలా సాగు చేయాలని ...వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలుసుకోవాల్సిన విషయాలపై శిక్షణ, అవగాహన కల్పిస్తోంది. రాష్ట్ర ఉద్యానశాఖ (Horticulture)ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పథకానికి అందరూ అర్హులేనని ప్రకటించింది.

Love affair : మైనర్‌ బాలికకు ప్రేమ వల వేశాడు ..మేజర్‌ కాగానే జంప్ .. ఏడాది అవుతున్న దొరకని జాడ

ఇంటిపైనే సాగు..

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో ఉండే గృహిణులు, అర్బన్‌ ఫామింగ్‌పై ఆసక్తి కలిగిన వాళ్లకు ప్రభుత్వం ఓ సదావకాశం కల్పిస్తోంది. అర్బన్ ఫామింగ్ పథకం ద్వారా ప్రతి నెల నాల్గవ ఆదివారం రోజున మిద్దెలు, ఇంటి బాల్కనీల్లో కూరగాయలు, ఆకు కూరలు, పూల మొక్కలు, పండ్ల చెట్లను పెంచాలనుకునే వారి కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఉద్యాన శాఖ, తెలంగాణ రాష్ట్రం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఈనెల నాల్గవ ఆదివారం రోజున అనగా 25-09-2022 నాడు హైదరాబాద్‌ నాంపల్లిలోని రెడ్ హిల్స్ దగ్గరున్న ఉద్యాన శిక్షణా కేంద్రంలో శిక్షణ, అవగాహన తరగతలను నిర్వహిస్తోంది.

Urban Farming
(Urban Farming)

సాగుకు తగిన సలహాలు, సూచనలు..

ముఖ్యంగా ఈ శిక్షణలో నిపుణులు, అనుభవజ్ఞులతో టెర్రస్, బాల్కనీలతో పాటు ఇంటి ఆవరణలో సాగు గురించి, ప్రాధమిక అంశాలు, స్థల ఎంపిక, మొక్కల ఎంపిక మట్టి మిశ్రమం తయారి విధానం, విత్తనాల ఎంపిక, సేంద్రియ ఎరువుల యాజమాన్యము, నీటి యాజమాన్యము, సేంద్రియ పద్ధతిలో చీడ, పీడల నివారణ గురించి విపులంగా శిక్షణ యివ్వబడును. అనంతరం ఉద్యాన శిక్షణ సంస్థ, రెడ్ హిల్స్ నందు యిప్పటికే చేయుచున్న మిద్దె తోట సందర్శన ఉండును. ఆసక్తి కలిగిన నగరవాసులు పురవాసులు మరిన్ని వివరాలకు ఈ నెంబర్ వాట్సప్ మెసేజ్ 9705384384 పంపి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఉద్యానశాఖ, ప్రభుత్వం కోరుతోంది. ఈవిధంగా మిద్దె తోటల సాగు విధానం తెలుసుకునేందుకు గాను శిక్షణ ఫీజును ఫీజు 100 రూపాయలుగా నిర్ధారించినట్లుగా తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్, సెరీ కల్చర్ డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Telangana Government, Telangana News

ఉత్తమ కథలు