HYDERABAD TELANGANA GIRL GUIDE KILLED AFTER FALLING INTO RIVER WHILE PARAGLIDING IN SIKKIM PAH
Shocking: సిక్కిం పారాగ్లైడింగ్‌లో పెను విషాదం.. నదిలో పడి తెలంగాణ యువతి మృతి..
ప్రమాదం జరిగిన ప్రదేశం
Sikkim: కొండపైన టూరిస్ట్ తో కలిసి పారాగ్లైడింగ్ చేస్తున్న బాలికకు ఊహించని ఘటన ఎదురైంది. బలమైన గాలులు ఎదురు రావడంతో వారు బ్యాలెన్స్ కోల్పోయారు. ఈ క్రమంలో వారు.. అక్కడే ఉన్న నదిలో పడిపోయారు.
Telangana paraglider Dies in sikkim: సరదాగా పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్లిన యువతి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కొన్ని సార్లు మనం సాహాస యాత్రలు, విహార యాత్రలకు వెళ్తుంటాం. ఒక్కొసారి అనుకొని సంఘటనలు జరిగి ఆ విహార యాత్రలు కాస్త.. విషాద యాత్రలుగా మిగిలి పోతాయి. అచ్చం.. ఇలాంటి సంఘటన ప్రస్తుతం సిక్కింలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు.. తెలంగాణలోని ఖమ్మంకు చెందిన ఈషారెడ్డి (23), సిక్కింకు వెళ్లింది. అక్కడ కొన్ని రోజుల పాటు విహార యాత్రల కోసం వెళ్లింది. ఈ క్రమంలో ఆమె.. పారాగ్లైడింగ్ చేయాలను కుంది. వెంటనే అక్కడ ఉన్న టూరిస్ట్ గైడ్ దగ్గరకు వెళ్లింది. గ్యాంగ్ టక్ లోని థమీ దారా ప్రాంతానికి చెందిన సందీప్ గురుంగ్ (26) తో కలిసి పారాగ్లైడింగ్ కోసం వెళ్లింది. వీరిద్దరు శుక్రవారం.. రోజున కొండ దగ్గరకు వెళ్లి అక్కడ ప్రత్యేక మైన దుస్తులు ధరించి పారాగ్లైడింగ్ కు వెళ్లారు.
In a search operation, ITBP recovered two bodies- a tourist from Telangana and her paragliding guide, from Lachung river in North Sikkim, this evening. The paraglider reportedly lost balance due to strong winds and fell into the river.
ఈ క్రమంలో వారు.. గాలిలో ఎగిరిన కొద్ది సేపటికే బలమైన గాలులు వారికి వీచాయి. దీంతో వారు.. తమ బ్యాలెన్స్ ను కోల్పోయారు. అక్కడ ప్రవహిస్తున్నలంచుంగ్ నదిలో పడిపోయారు. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, ఐటీబీపీ పోలీసులు రంగంలోనికి దిగారు. వారు గజఈత గాళ్లతో కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
లంచుంగ్ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో కొన్ని గంటల పాటు వెతికిన తర్వాత.. వారి మృత దేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ కూతురు చనిపోయిందనే వార్త తెలియగానే కుటుంబమంతా తీరని విషాదంలో మునిగిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.