• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • HYDERABAD TELANGANA EDUCATION MINISTER SABITHA INDRA REDDY KEY ANNOUNCMENT ON REOPENING OF SCHOOLS AND COLLEGES SSR

Schools And Colleges Reopen: జూలై ఒకటి నుంచి తెలంగాణలో విద్యా సంస్థల ప్రారంభంపై మంత్రి కీలక ప్రకటన

మంత్రి సబితా ఇంద్రారెడ్డి (ఫైల్ ఫొటో)

  • Share this:
    హైదరాబాద్: తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్కూళ్లు, కాలేజీల పున: ప్రారంభంపై కీలక ప్రతిపాదనలు చేశారు. పాఠశాలల పునః ప్రారంభం, ప్రత్యక్ష తరగతులపై పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు చేసింది. జులై ఒకటి నుంచి 8 ,9,10 తరగతులు ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఉదయం 9.30 నుంచి 3.30 గంటల వరకు తరగతులు జరిగేలా.. జులై 20 నుండి 6 ,7 తరగతులు ప్రారంభించేలా, ఆగస్ట్ 16 నుంచి 3, 4,5 తరగతులు ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జూలై 1 నుంచి తరగతుల బోధన విధివిధానాలపై విద్యాశాఖ సమావేశం ముగిసిన అనంతరం సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి టీచర్లు స్కూల్స్‌కి హాజరుకావాలని మంత్రి ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం కూడా జీఓ 46 ప్రకారమే ఫీజులు తీసుకోవాలని, ఒకటి రెండు రోజుల్లో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశం కానున్నట్లు సబితా పేర్కొన్నారు. ఇంటర్ తరగతులపై సంక్షేమ శాఖ మంత్రులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో వారితో సమావేశం అవ్వనున్నట్లు, టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఎల్లుండి మంత్రులు, కొప్పుల,సత్యవతి రాథోడ్,గంగుల కమలాకర్‌తో సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. ఇంటర్ పైబడిన అన్ని తరగతులకు ప్రత్యక్ష బోధన ఉండనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాల విషయంలో సందిగ్ధం నెలకొంది. ఎల్లుండి విధి విధానాలను విద్యాశాఖ ప్రకటించనుంది.

    ఉపాధ్యాయులను రిస్క్ టేకర్స్ జాబితాలో చేర్చేందుకు సీఎస్‌కి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. 18 ఏళ్లు పైబడిన విద్యార్థులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామని, గతేడాది లానే ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారని మంత్రి సబితా చెప్పారు. ఈ ఏడాది 30 శాతం ఫీజులు తగ్గించేలా ప్రైవేట్ పాఠశాలకు విజ్ఞప్తి చేస్తామని మంత్రి తెలిపారు.

    ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చే వారంలో విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని.. డిగ్రీ, పీజీ ప్రత్యక్ష తరగతులు జులై 1నుంచి ప్రారంభం అవుతాయని సబితా పేర్కొన్నారు. డిప్లమో, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు జూన్ 1నుంచి 31 లోపు పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. విద్యా శాఖలో వెయ్యి గురుకులాలు ఉన్నాయని, వాటికి సంబంధించిన మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ద్వితీయ సంవత్సర ఫలితాలు వచ్చే వారంలో.. జులై ఒకటి నుంచి జులై చివరి వరకు డిగ్రీ,పిజి పరీక్షలు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
    Published by:Sambasiva Reddy
    First published: