HYDERABAD TELANGANA DOUBLE CHARGES ARE LEVIED ON CURRENT BILLS EXCEEDING 100 UNITS SNR
Telangana:పేద,మధ్యతరగతి ప్రజలకు కరెంట్ షాక్..నెల రోజుల్లోనే రెట్టింపైన విద్యుత్ ఛార్జీలు
(ప్రతీకాత్మకచిత్రం)
Current Bills:తెలంగాణలో మార్చి నెల వేరు ఏప్రిల్ నెలలో లెక్క వేరు అన్నట్లుగా ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే దానికంటే అదనంగా వాడే కరెంట్‌పై రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సర్కారు బాదుడికి జనం కళ్లు తేలేస్తున్నారు.
తెలంగాణ (Telangana)లో ఎండలే కాదు కరెంట్ బిల్లులు(Current bills)కూడా ప్రజలకు మోత మోగిస్తున్నాయి. వేసవి తీవ్రత తట్టుకోలేక రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు వేసుకోవడం కారణంగా కరెంట్ వాడకం పెరిగింది. విద్యుత్ వినియోగం పెరగడానికి అనుగూణంగానే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచింది. ముఖ్యంగా 50, వంద, రెండు వందల యూనిట్ల( Units)వరకు విద్యుత్‌ని ఉపయోగించిన వారిపై ఈ బాదుడు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పేద,మధ్యతరగతి ప్రజలపై పడుతున్న అదనపు భారంగానే చూడాల్సి వస్తోంది. ప్రభుత్వం మాత్రం నిన్నటి వరకు ఓ లెక్క ..ఇకపై మరో లెక్క అన్నట్లుగా ఉంది. మార్చి(March)నెల వరకు 100 యూనిట్లలోపు వరకు కరెంట్ వాడుకున్న వాళ్లకు కేవలం విద్యుత్ బిల్లు వంద రూపాయల నుంచి 150 రూపాయల లోపు వచ్చేది. కాని ఏప్రిల్(April) నెలలో వచ్చిన కరెంట్ బిల్స్ చూస్తే సాధారణ ప్రజలు, పేదలు నోరువెళ్లబెడుతున్నారు. ఎందుకంటే మార్చి నెలలో వంద యూనిట్లకుపైగా కరెంట్ వాడుకుంటే 100 రూపాయల నుంచి 150 మధ్యలో వచ్చేది..ఏప్రిల్ నెలలో చూసుకునే సరికి అదే పవర్ బిల్లులు రెట్టింపు అంటే 300 నుంచి 350రూపాయల కరెంట్ వచ్చిందని వినియోగదారులు గుబులు చెందుతున్నారు. అంటే ఒక్క నెల రోజుల వ్యవధిలోనే ఒక్కో కరెంట్ బిల్లుపైన ప్రభుత్వం రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తోందన్న మాట. మార్చి నెలతో పోలిస్తే పెరిగిన కరెంట్ బిల్లు శాతం సుమారు 63.29శాతం పెరిగినట్లుగా చూపిస్తోంది.
సమ్మర్ ఎఫెక్ట్..
వేసవి తీవ్రత కారణంగా కాస్తున్న ఎండల కంటే ప్రభుత్వం వసూలు చేస్తున్న కరెంట్ బిల్లులే ఎక్కువ మోత పుట్టిస్తున్నాయిని పేద, సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. ఎండకాలం ఇంకా నెల రోజులు ఉండటంతో ఈ నెల బిల్లు కూడా అంతే స్థాయిలో వస్తుందని భయపడిపోతున్నారు. గతంలో వంద యూనిట్లు, రెండు వందల యూనిట్ల వరకు ఉచితం అని చెప్పిన ప్రభుత్వం వేసవి సీజన్లో ఈ రేంజ్లో చార్జీలను పెంచడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రెట్టింపు ఛార్జీలు వసూలు..
శ్రీమంతులు, సంపన్నులు, వ్యాపారస్తులకు ఆదాయం వచ్చే మార్గాలు బోలడన్ని ఉంటాయి కాబట్టి వారికి ఎంత పెంచిన పర్వాలేదన్నది తెలంగాణలోని సామాన్య ప్రజల మాట. కాని పేదలను కూడా ఈవిధంగా విద్యుత్ ఛార్జీల పెంపుతో ఒకటి, రెండు నెలలు ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సమంజసంగా లేదంటున్నారు. అయితే వేసవి తీవ్రత కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగింది. అయితే పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈ వేసవి తర్వాత సాధారణంగా అంటే ఏప్రిల్‌లో వచ్చిన విధంగా వస్తాయా లేదంటే ఇదే పద్దతిలో అధికశాతం వసూలు చేస్తారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.