తెలంగాణ (Telangana)లోని హైదరాబాద్ వేదికగా బీజేపీ తమ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని (BJP National executive meeting 2022) నిర్వహిస్తోంది. నేటి నుంచి రెండు రోజులపాటు జరగనున్న బీజేపీ ప్లీనరీకి ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi), హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. జూలై 2,3 తేదీల్లో జరగబోయే బీజేపీ స్పెషల్ మీట్ లో స్పెషల్ మెనూ(Special menu)ను ఫైనల్ చేశారు. మధ్యాహ్నం భోజనంలో తెలంగాణ వంటకాలు (Telangana dishes) ఉండేలా చూస్తున్నారు.
హైదరాబాద్ (Hyderabad)లో నేటి నుంచి జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP National Executive meeting 2022), బహిరంగ సభ దృష్ట్యా నగరవ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రెండు రోజులూ వీఐపీలు చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ పహారా కాస్తున్నారు. నేడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం అమ్మవారిని దర్శించుకోనున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేడు హైదరాబాద్ రానున్నారు. శనివారం, ఆదివారం జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శుక్రవారం నుంచి 4వ తేదీ వరకు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అదేవిధంగా నోవాటెల్ హోటల్లో బస చేయనున్న మోదీకి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.