హోమ్ /వార్తలు /తెలంగాణ /

Breaking News: తెలంగాణ సీఎస్ ఏపీకి వెళ్లాల్సిందే..హైకోర్టు కీలక ఆదేశాలు

Breaking News: తెలంగాణ సీఎస్ ఏపీకి వెళ్లాల్సిందే..హైకోర్టు కీలక ఆదేశాలు

సోమేశ్ కుమార్

సోమేశ్ కుమార్

తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పూర్త్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలో సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. అలాగే సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) సొంత రాష్ట్రమైన ఏపీకి వెళ్లాలని హైకోర్టు సూచించింది. గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. న్యాయవాది అభ్యర్ధనతో కోర్టు తీర్పు 3 వారాల పాటు నిలిపివేశారు. దీనిపై సీఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Vizag: ఆ చెరువు దగ్గర ఏం జరుగుతోంది.. అన్ని చేపలు ఎలా చనిపోతున్నాయి..? కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

కాగా ప్రస్తుతం తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) సహా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏపీకి చెందిన వారు. వీరందరిని కూడా రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నియమించింది. కానీ వీరంతా (CAT) కేంద్ర పరిపాలన టిబ్యునల్ దగ్గర పర్మిషన్ తీసుకొని తెలంగాణకు వచ్చారు. దీనితో కేంద్రం 2017లోనే కోర్టును ఆశ్రయించింది. దీనితో అప్పటి నుంచి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు గతంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కొట్టివేసింది. అలాగే సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) క్యాడర్ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలో సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే అని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) న్యాయవాది అభ్యర్ధనతో కోర్టు తీర్పును 3 వారాల పాటు నిలిపివేసింది.

Telangana High Court: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం..రైతుల పిటీషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో సీఎస్ సోమేశ్ కుమార్?

కాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ 3 వారాల సమయంలో సీఎస్ సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తుంది. లేదా ఏపీ ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని తెలంగాణలో పని చేయాల్సి వుంటుంది. అయితే అందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

అయితే ఒకవేళ సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) ఏపీకి వెళ్తే అదే దారిలో మరికొంతమంది ఐపీఎస్, ఐఏఎస్ లు వెళ్లే అవకాశం ఉంది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ తరువాత అత్యధిక బాధ్యతలు సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) కు ఉంటాయి. పథకాలకు సంబంధించి ఉత్తర్వులు మిగతా శాఖల పని తీరును చూడాల్సి ఉంటుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్తే ఆయన స్థానంలో కొత్త సీఎస్ ను నియమించాల్సి ఉంటుంది.

First published:

Tags: Cs somesh kumar, Somesh kumar, Telangana, Telangana Government, Telangana High Court, Telangana News

ఉత్తమ కథలు