Huzurabad by Elections : బుటకపు ఎన్నికలు రద్దు చేయండి.. ఎన్నికల కమిషన్‌కు కాంగ్రేస్ ఫిర్యాదు..

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad by Elections : హుజూరాబాద్‌లో విచ్చల విడిగా డబ్బు చేస్తుండడంతో పాటు ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రేస్ పార్టీ ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికలను రద్దు చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.

  • Share this:
    హుజురాబాద్ ( Huzurabad by Elections ) ఉపఎన్నికను రద్దు చేయాలని కాంగ్రేస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్‌కు ఆపార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతూ విచ్చలవిడిగా డబ్బు, మద్యాన్ని పంచుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. టీఆర్ఎస్ ,బీజేపీ ( TRS BJP ) రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నాయని ఫిర్యాదులో పేర్కోన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్, ( election comission ) కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకులు టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఎక్కడా ప్రజాస్వామ్యం కనిపించడం లేదన్నారు. వేలం పాట పాడి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

    తెలంగాణ సమాజాన్ని మొత్తం మద్యం మత్తులో ఊగేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఎన్నికలు మొత్తం రద్దు చేస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్‎ను సస్పెండ్ చేసి కొత్త ఎన్నికల అధికారిని పంపాలంటూ విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నక్సలైట్లు నాడు చెప్పింది నిజమేననిపిస్తోందని అన్నారు. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని అంటూ నక్సలైట్లు అప్పట్లో అనేవారని.. ఇప్పుడు జరుగుతున్న అవి పూర్తిగా బూటకపు ఎన్నికలేనని దుయ్యబట్టారు.

    ఇది చదవండి : నగర మంత్రికి, ఎమ్మెల్యేకు జీహెచ్‌ఎంసీ షాక్.. ఫ్లేక్సీలకు ఫైన్


    రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పక్కన పెట్టి హుజురాబాద్‎లో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. తమ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించిందని, విచారణకు అధికారులను పంపిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ ఇతర అక్రమాల నేపథ్యంలో గతంలో తమిళనాడులోని వేలూరు లోక్‌సభ ఎన్నికను రద్దుచేసిన విషయాన్ని గుర్తు చేశారు.

    ఇది చదవండి : తనకు తెలియకుండ చేసిన పనికి కోపంతో ఊగిపోయిన మహిళ.. చుక్కలు చూపించింది..!


    ప్రస్తుతం హుజురాబాద్ విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఉందని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తమిళనాడు తరహాలోనే హుజురాబాద్ ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2019లో తమిళనాడులోని వేలూరు లోక్‌సభ ఎన్నికను నిలిపేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వేలూరు నియోజకవర్గంలో ధన ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ఎన్నికను నిలిపివేస్తూ వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికలకు మరో రెండు రోజులు ఉన్న సమయంలో ఇది సాధ్యమవుతుందా లేక ఎన్నికల కమీషన్ లైట్‌గా తీసుకుంటుందా వేచి చూడాలి.
    Published by:yveerash yveerash
    First published: