Home /News /telangana /

HYDERABAD TELANGANA CONGRESS HAS 40 LACS DIGITAL MEMBERSHIP SAID REVANTH REDDY VRY

Revanth Reddy : కాంగ్రెస్ పార్టీకి 40 లక్షల ఏకే 47లు.. అధికారం ఖాయమన్న రేవంత్ రెడ్డి..

revanth reddy

revanth reddy

Revanth Reddy : సీఎం కేసీఆర్ వెనుక రాజకీయ వ్యుహకర్త పీకే ఉంటే కాంగ్రెస్ పార్టీ వెంట 40 లక్షల మంది ఏకే 47 లాంటీ కార్యకర్తలు ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో నలభై లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి టీ.కాంగ్రెస్ దేశంలో నెంబర్ వన్‌గా నిలబడిందని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు..అయితే వాటిని 50 లక్షల వరకు ఈ సభ్యత్వాలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు... ఇక ప్రస్తుత సభ్యత్వాలకు తోడు రాబోయే ఎన్నికల్లో 80 లక్షల ఓట్లు వస్తే కాంగ్రెస్‌ గెలుపు సునాయాసమవుతుందని అన్నారు. సభ్యత్వ నమోదులో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రేస్ పార్టీ సభ్యత్వం చేసిన వారికి 2 లక్షల ఇన్సూరెన్స్‌ కల్పిస్తున్నామని చెప్పారు. ఈ ఇన్సూరెన్స్‌ పర్యవేక్షణ కోసం పార్టీలో ఒక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని వివరించారు..

    మరోవైపు టీఆర్ఎస్ పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు పీకే ఉంటే కాంగ్రెస్‌లో 40 లక్షల మంది ఏకే 47 లాంటి వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ఇదే ఉదహారణ అని చెప్పారు.. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని అయితే.. పార్టీ నాయకులు అందిపుచ్చుకునేందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.. సభ్యత్వంలో బలంగా పని చేసిన వారికే టికెట్ అవకాశాలు ఉంటాయని మరోసారి స్పష్టం చేశారు.. ఎలాంటి పైరవీ లేకుండా వాళ్లకు టికెట్ ఇచ్చే హామీ నాది అన్నారు... పని చేయని వారికి టికెట్‌తో పాటు ఎలాంటి పదవి రాకుండా నేను అడ్డుకుంటానని వార్నింగ్ ఇచ్చారు... ప్రతి బూత్ నుంచి వంద సభ్యత్వం ఉంటేనే ఆ నియోజవర్గంలో పీసీసీ మెంబర్ ఉంటుంది. వంద సభ్యత్వం లేకుండా ఎంత పెద్ద నాయకుడు ఉన్నా పీసీసీ సభ్యత్వం ఇవ్వమని చెప్పారు.. టికెట్ల ఎంపికలో ఢిల్లీ నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారని, కాబట్టి టికెట్ ఆశించిన వారు జాగ్రత్తగా పనిచేయాలని అన్నారు...

    Ukraine Crisis : అప్పుడు లాక్‌డౌన్‌లో ఇప్పుడు ఉక్రెయిన్‌లో.. కొడుకు కోసం 1400 కి.మీ బైక్ పై వెళ్లిన తల్లికి మరో కష్టం..

    సభ్యత్వంపై పని చేసిన వారిపై సమగ్ర నివేదిక సోనియా గాంధీకి అందజేస్తానని చెప్పారు.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీ సభ్యత్వం ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.. పార్టీ సమావేశానికి రాని వారిని, లైట్‌గా తీసుకున్న వారిని పదవుల ఎంపికలో అవకాశాలు కల్పించమని స్పష్టం చేశారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Revanth Reddy, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు