HYDERABAD TELANGANA CONFLUENCE OF MUSI KRISHNA MAY THROW UP DIAMONDS SAYS STUDY GH VB
Telangana: తెలంగాణలోని ఆ ప్రదేశం వద్ద వజ్రాలు లభ్యం అవుతాయట.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు..
ప్రతీకాత్మక చిత్రం
తాజాగా చేపట్టిన పరిశోధన అధ్యయనాలు నల్గొండ జిల్లాలోని కృష్ణా నదిలో మూసీ నది కలిసే సంగమ ప్రదేశంలో వజ్రాలు దొరికే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఓయూ యూనివర్సిటీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇతర సంస్థల పరిశోధకులు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల్లో అధ్యయనాలు చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం మధ్య నుంచి కృష్ణా నది ఉపనది అయిన మూసీ నది ప్రవహిస్తుంటుంది. హైదరాబాద్ వాసులకు మూసీ నది ఒక మురికికాలువ లాంటిదే కానీ ఇప్పుడది వజ్రాల గని (diamond mine) కాబోతోంది. తాజాగా చేపట్టిన పరిశోధన అధ్యయనాలు నల్గొండ జిల్లాలోని కృష్ణా నదిలో మూసీ నది కలిసే సంగమ ప్రదేశంలో వజ్రాలు దొరికే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఓయూ యూనివర్సిటీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇతర సంస్థల పరిశోధకులు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల్లో అధ్యయనాలు చేపట్టారు.
అయితే ఈ పరిశోధకుల అధ్యయనాల్లో నల్గొండలో వజ్రాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా మూసీ నది కృష్ణానదిలో కలిసే చోట వజ్రాల గని ఉంటుందని పరిశోధన అధ్యయనాల్లో విస్పష్టమయింది. అందుకే ప్రస్తుతం హైదరాబాద్‌లోని మూసీ దిగువన, కృష్ణాలో సంగమం జరిగే వాడపల్లి వరకు తాను దృష్టి సారించినట్లు ఓయూ ప్రొఫెసర్ రామదాస్ తెలిపారు.
అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో భీమా నది కృష్ణమ్మ ఒడిలో కలిసే ప్రదేశంలో.. గద్వాల్ జిల్లాలో తుంగభద్ర నది కృష్ణాలో కలిసే ప్రదేశంలో వజ్రాలు కలిగిన కింబర్లైట్లు, లాంప్రాయిట్లు కూడా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ప్రఖ్యాత కోహినూర్‌తో సహా ప్రపంచంలో ఇప్పటివరకు దొరికిన అత్యుత్తమ వజ్రాలలో కొన్ని కృష్ణా నది నుంచే లభించినవే. లాంప్రోయిట్ అనేది అల్ట్రాపోటాసిక్ మాంటిల్-ఉత్పన్నమైన ఒక అగ్నిపర్వత లేదా ఉప-అగ్నిపర్వత శిల. కింబర్లైట్ అనేది కూడా ఒక అగ్ని శిలే. ఈ రెండు ప్రత్యేకమైన రాళ్ల నుంచి వజ్రాలు వెలికితీయవచ్చు. ఇలాంటి రాళ్లు/శిలలు మన కృష్ణా నదిలో ఉపనదులు సంగమం అయ్యే ప్రదేశంలో ఉండటం విశేషం.
గోల్కొండలో వజ్రాలు తవ్వినప్పటికీ అక్కడ ఏం దొరకలేదు. కాకపోతే దక్షిణ భారత వజ్రాల ప్రావిన్స్ లో తవ్విన వజ్రాలను 'గోల్కొండ వజ్రాలు' అని పిలుస్తారు. ఎందుకంటే రాజ్యంలో ఇక్కడే ప్రసిద్ధ గనులు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మనిషి కంటికి చిక్కకుండా దాగున్న వజ్రాల సంపదను విజయవంతంగా బయటకు తీస్తే.. ‘గోల్కొండ వజ్రాలు’ అనే నామకరణం నిజమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
నల్గొండలో కనిపించిన డైమండ్ పాకెట్స్..
రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల్లో అధ్యయనాలు చేపట్టగా రంగారెడ్డిలో వజ్రాలు లేవని నిర్ధారణ అయినట్లు ఓయూ జియోఫిజిక్స్ మాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జి. రామదాస్ వెల్లడించారు. అయితే వజ్రాలు నల్గొండ జిల్లా నుంచి వెలికి తీసే అవకాశం ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా మూసీ కృష్ణానదిలో కలిసే చోట మైనింగ్ చేస్తే మేలిమి వజ్రాలను వెలికి తీసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లోని మూసీ దిగువన, కృష్ణాలో సంగమం జరిగే వాడపల్లి వరకు తాము దృష్టి సారించినట్లు రామదాస్ తెలిపారు. కృష్ణానదిలో తుంగభద్ర, భీమా, మూసీ నదుల సంగమ ప్రదేశాల్లో వజ్రాలతో కూడిన శిలలు ఉన్నాయని.. కాకపోతే అవి భూమిలో లోతుగా ఉన్నాయని రామదాస్ స్పష్టం చేశారు.
సౌత్ ఇండియన్ డైమండ్ ప్రావిన్స్ (SIDP) తెలుగు రాష్ట్రాల మీదుగా నడుస్తుంది. ఇందులో డెక్కన్ కింబర్లైట్ ఫీల్డ్, వజ్రకరూర్ కింబర్లైట్ ఫీల్డ్, మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట నుంచి కర్ణాటకలోని గుల్బర్గా వరకు విస్తరించి ఉన్న కింబర్లైట్ ఫీల్డ్, కర్ణాటకలోని మహబూబ్‌నగర్.. రాయచూర్‌ను కవర్ చేసే రాయచూర్ కింబర్లైట్ ఫీల్డ్ ఉన్నాయి. వజ్రాన్ని కనుగొన్నట్లు ఓ రైతు చెప్పడంతో తమ బృందం రంగారెడ్డిలోని అమంగల్‌లో అధ్యయనం చేసిందని రామదాస్ చెప్పారు. ఐతే తమ పరిశోధనలో అమంగల్‌లో డైమండ్ జోన్లు లేవని తేలిందని ఆయన చెప్పారు.
కల్వకుర్తి మండలంలో వజ్రాలు ఉన్నట్లు ఇటీవల రామదాస్ రీసెర్చ్ లో తేలింది. "ఈ ప్రాంతంలో డైమండ్ల ఉనికిని సూచించే డైక్‌లు, ఫాల్ట్ కాంటాక్ట్ పరిసరాలు ఉన్నాయి" అని రామదాస్ చెప్పారు. గతంలో, పరిశోధకులు కృష్ణా బేసిన్‌లోని మిర్యాలగూడలోని రామన్నపేట-ఉస్తాపల్లి లాంప్రోయిట్ బాడీ వద్ద వజ్రాలు లభ్యమయ్యే ప్రాంతాలు ఉన్నట్లు కనుగొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.