హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: యశోద ఆస్పత్రి నుంచి సీఎం కేసీఆర్​ డిశ్చార్జి.. ముఖ్యమంత్రికి వైద్యులు ఏం సూచించారంటే..?

CM KCR: యశోద ఆస్పత్రి నుంచి సీఎం కేసీఆర్​ డిశ్చార్జి.. ముఖ్యమంత్రికి వైద్యులు ఏం సూచించారంటే..?

తెలంగాణ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి ఆయన వెళ్లారు.కాగా, ట్రీట్​మెంట్​ అనంతరం సీఎం డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో కేసీఆర్​కు వైద్యులు పలు సూచనలు చేశారు.

    తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి ఆయన వెళ్లారు. నిన్నటి నుంచి ఎడమ చేయి, నొప్పిగా అనిపిస్తోందని.. నీరసంగా ఉన్నారని సీఎంవో వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు పలు వైద్య పరీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ (CM KCR)కు హార్ట్ యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు చేశారు. కేసీఆర్ (CM KCR) సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, కూతురు కవిత, సంతోష్, హరీష్ రావు, మనవడు హిమాన్షు కూడా ఆస్పత్రికి వెళ్లారు. సీఎం ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండడంతో కార్యకర్తల్లో కొంత ఆందోళన నెలకొంది. ఐతే ఎలాంటి సమస్యా లేదని చెప్పడంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ట్రీట్​మెంట్​ అనంతరం యశోదా ఆసుపత్రి నుంచి కేసీఆర్ (CM KCR) డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేసీఆర్​ ఆసుపత్రి నుంచి బయటికి వస్తున్నట్లు తెలంగాణ సీఎంవో ట్విటర్​లో వీడియో పోస్టు చేసింది.

    యశోదా ఆసుపత్రి నుంచి ఆయన (CM KCR) ప్రగతి భవన్‌కు బయలుదేరారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు ముఖ్యమంత్రికి సూచించారు. కేసీఆర్‌ను పరీక్షించిన డాక్టర్ Vishnu Reddy, డాక్టర్లు ఎంవీ రావు, Pramod kumar కుమార్ మీడియాతో మాట్లాడారు.

    అంతకుముందు మీడియాతో మాట్లాడిన వైద్యులు.. 'సీఎం కేసీఆర్ రెండు మూడు రోజులుగా నీరసంగా ఉన్నారు. డాక్టర్లు ఇంట్లోనే చికిత్స అందించారు. ఐతే ఇవాళ ఎడమ చేయి నొప్పిగా ఉందని చెప్పారు. ఆస్పత్రికి వచ్చి బటెస్ట్‌లు చేయించకుంటే బెటర్ అని చెప్పాం. అందుకోసమే సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చారు. కరోనరీ యాంజియోగ్రామ్ చేశాం. అందులో అదృష్టవశాత్తు ఎలాంటి అడ్డంకులు లేవు. ఈసీజీ టెస్ట్‌ కూడా నార్మల్‌గా ఉన్నాయి. గుండెకు సంబంధించి కొన్ని ఇతర పరీక్షలు కూడా చేశాం. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి.

    కార్డియక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మరి ఎందుకు ఎడమ చేయిలో నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకునేందుకు సర్వైకల్ స్పైన్ ఎంఆర్ఐ, బ్రెయిన్ ఎంఆర్‌ఐ పరీక్షలు చేశాం. సర్వైకల్ స్పాండిలోసిస్ కొద్దిగా ఉన్నట్లు తేలింది. వయసుతో పాటు ఇది వస్తుంది. మెడ నరంపై ఒత్తిడి పడడం ఎడమ చెయ్యికి నొప్పి వస్తోంది. బీపీ, షుగర్ కూడా ప్రస్తుతం బాగానే ఉన్నాయి. కిడ్నీ, లివర్ ఫంక్షన్స్ నార్మల్‌గానే ఉన్నాయి. వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని చెప్పాం. ఇవాళ ఇంటికి పంపిస్తాం. ఇక నుంచి ప్రతివారం బ్లడ్ టెస్ట్ చేయాలి. వచ్చే ఏడాది మళ్లీ ప్రివెంటివ్ చెకప్ చేస్తాం. ' అని యశోదా డాక్టర్లు తెలిపారు.

    First published:

    Tags: CM KCR, Hospitalised, Telangana

    ఉత్తమ కథలు