హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana | KCR: నేడు కామారెడ్డి జిల్లాకు తెలంగాణ సీఎం .. కేసీఆర్ టూర్‌కి కారణం ఏంటో తెలుసా..?

Telangana | KCR: నేడు కామారెడ్డి జిల్లాకు తెలంగాణ సీఎం .. కేసీఆర్ టూర్‌కి కారణం ఏంటో తెలుసా..?

సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

Telangana | KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లోని తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఈరోజు కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లోని తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. ఈసందర్బంగా సీఎం టూర్‌కి సంబంధించిన ఏర్పాట్లు చేశారు అధికారులు. సీఎం కామారెడ్డి (Kamareddy)జిల్లా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా కామారెడ్డి జిల్లా అధికారులకు పంపారు సీఎంవో అధికారులు. బుధవారం ఉదయం 10గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా పర్యటనకు బయల్దేతారు.

కామారెడ్డికి కేసీఆర్ ..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్నారు. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లాకు నేడు వెళ్లనున్నారు. ఉదయం 10గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్‌లో బయల్దేరుతారు. ఉదయం 10.40గంటలకు బాన్సువాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిమ్మాపూర్‌లోని తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న కల్యాణోత్సవాల్లో పాల్గొంటారు.

కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు..

ఆలయంలోని శ్రీదేవి,భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి కల్యాణోత్సవాన్ని తిలకిస్తారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. కల్యాణోత్సవం ముగియగానే తిరిగి మధ్యాహ్నం 1.30నిమిషాలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను కామారెడ్డి జిల్లా అధికారులకు సీఎంవో పంపడంతో అక్కడి అధికారులు కేసీఆర్‌ పర్యటనపై పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.

Telangana: తెలంగాణలో ఢిల్లీ మద్యం స్కామ్ రీ-సౌండ్.. బీజేపీ సమావేశంలో నిర్ణయం

ఈ ఆలయానికి మహర్ధశ ..

తెలంగాణలోని ఆలయకు నూతన వైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే గతంలో యాదగిరిగుట్టను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని యాదాద్రిగా పునఃనిర్మాణం చేపట్టారు. ఇప్పుడు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. ఆ దేవాలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే ఈసారి తిమ్మాపూర్‌ తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తారనే అక్కడి ప్రజలు భావిస్తున్నారు.

First published:

Tags: CM KCR, Kamareddy, Telangana News

ఉత్తమ కథలు