Home /News /telangana /

HYDERABAD TELANGANA CM KCR SERIOUS OVER DRUGS USAGE IN HYDERABAD AND A MEETING HAS BEEN ARRANGED WITH THE POLICE CHIEFS OF ALL THE DISTRICTS ON THE 28TH OF THIS MONTH PRV

Hyderabad: హైదరాబాద్​లో డ్రగ్స్​పై సీఎం కేసీఆర్​ సీరియస్​.. ఈ నెల 28న మీటింగ్​కు రావాలని వారందరికీ పిలుపు

సీఎం కేసీఆర్​

సీఎం కేసీఆర్​

తెలంగాణలో మాదక ద్రవ్యాల( డ్రగ్స్ ) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా .. డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు ..

తెలంగాణ (Telangana)లో మాదక ద్రవ్యాల( Drugs ) వాడకం అనే మాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (Chief minister K Chandra Sekhar Rao) అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా .. డ్రగ్స్ (Drugs) వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా.. ఈనెల 28 వ తేదీ శుక్రవారం నాడు ( ఎల్లుండి ) ప్రగతిభవన్ లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరుగనున్న ఈ సదస్సు (Meeting) లో రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, సీఎస్, డీజీపీ, డీజీలు, అన్ని జిల్లా ల ఎస్పీలు (Sp), కమిషనర్లు, డీసీపీ (DCP) అధికారులు వారితో పాటు రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు సంబంధిత ఉన్నతాధికారులు తదితరులు పాల్గొననున్నారు.

పాశ్చాత్య సంస్కృతి కూడా..

హైదరాబాద్​ (Hyderabad) మహానగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. దానితో పాటు పాశ్చాత్య సంస్కృతి కూడా పాతుకుపోతోంది. ఇప్పటికే పబ్​లు, డ్రగ్స్​ హైదరాబాద్​ను కుదిపేస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్​ డ్రగ్స్​  (Drugs)విషయంపై సీరియస్​ (Serious) అయ్యారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు (To strictly control drug use in Telangana) చేపట్టాల్సిన కార్యాచరణ విధి విధానాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ మేరకు పోలీసు శాఖ , ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేయనున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష..

రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించే (Controlling) దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యల పై బుధవారం ప్రగతి భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (CS Somesh kumar) , డీజీపీ మహేందర్ రెడ్డి, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో (Meeitng) సీఎంవో ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

1,000 మందితో ప్రత్యేక విభాగం..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)​ మాట్లాడుతూ... మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని అన్నారు. కఠిన చర్యల అమలుకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 (వెయ్యి) మంది తో కూడిన ప్రత్యేకంగా (Special) .. ‘‘ నార్కాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ’’ (కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్) పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి (DGP Mahender Reddy) ని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో, డ్రగ్స్ ను, వ్యవస్థీకృత నేరాలను (Crimes) నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక విధులను నిర్వర్తించనున్నది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: CM KCR, Drugs, Drugs case, Hyderabad, Telangana, Tollywood drug case

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు