హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR National party: జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయం వచ్చింది.. త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు: సీఎం కేసీఆర్​

KCR National party: జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయం వచ్చింది.. త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు: సీఎం కేసీఆర్​

కుమార స్వామితో సీఎం కేసీఆర్​

కుమార స్వామితో సీఎం కేసీఆర్​

దేశంలోని మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించామని తెలంగాణ సీఎం కేసీఆర్​.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  దేశంలోని మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించామని తెలంగాణ సీఎం కేసీఆర్  (Telangana CM KCR) అన్నారు​. త్వరలోనే జాతీయ పార్టీ (National Party) ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్.డి కుమారస్వామి (HD Kumaraswamy)కి సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.  తెలంగాణ సాధించిన కేసీఆర్ అనుభవం దేశానికి అవసరమని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకలవర్గాలను కలుపుకొని కేసీఆర్ తెలంగాణ (Telangana) ను సాధించారని ఆయన గుర్తు చేశారు.

  తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ తెలంగాణను ప్రగతి పథాన నడుపుతున్న కేసీఆర్ (KCR) దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో (National politics) కేసీఆర్ క్రియాశీలక భూమిక పోషించాలని ఆయన కోరారు. అందుకు తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమారస్వామి ప్రకటించారు. త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కుమారస్వామి స్వాగతించారు. వర్తమాన జాతీయ రాజకీయాల్లో, దేశ పాలనలో ప్రత్యామ్న్యాయ శూన్యత నెలకొందన్నారు. ఈ తరుణంలో కెసిఆర్ వంటి సీనియర్ లీడర్ ఆవశ్యకత దేశానికి అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

  దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అనే అభిప్రాయం దేశ ప్రజల్లో సన్నగిల్లిందని, కాంగ్రెస్ నాయకత్వంపై దేశ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని, ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల ఐక్యత తక్షణావసరమని వారు చర్చించారు. తాను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి తెలంగాణ మాదిరిగానే దేశాన్ని కూడా నడిపించాలని తనపై రోజురోజుకూ వత్తిడి పెరుగుతోందని సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి తెలిపారు.

  KCR National party: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్​ వెంటే ఏపీ సీఎం జగన్​: టీఆర్​ఎస్​ మంత్రి 

  మతతత్వ బీజేపీపై, మోదీ నిరంకుశ వైఖరిపై పోరాడాలని తన జిల్లాల పర్యటనల సందర్భంగా ప్రతిచోటా బహిరంగసభలో ప్రజలు తమ మద్దతు తెలియజేస్తున్నారని కేసీఆర్ కుమార స్వామికి వివరించారు. తెలంగాణను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూ అనేకరకాలుగా ఆటంకాలు సృష్టిస్తున్న బీజేపీపై ప్రజలు పూర్తి వ్యతిరేక ధోరణితో ఉన్నారని, చివరకు తమ సొంత టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా గ్రామస్థాయి నుంచీ, జిల్లా, రాష్ట్ర స్థాయి అధ్యక్ష, కార్యదర్శివర్గాలు కూడా జాతీయ పార్టీని స్థాపించి, బీజేపీని ఇంటికి సాగనంపాలని ముక్తకంఠంతో తీర్మానాలు చేస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. మూస రాజకీయాలతో దేశ వ్యాప్తంగా ప్రజలు విసుగెత్తిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని, అయితే సరిపడే మంచి పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ గురించి కేసీఆర్, కుమారస్వామి చర్చించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Hd kumaraswamy, Hyderabad, Politics, Trs

  ఉత్తమ కథలు