హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR | Singareni : సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్‌ దసరా కానుక .. సంస్థ లాభాల్లోంచి 30శాతం వాటా ఇవ్వాలని ఆదేశం

KCR | Singareni : సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్‌ దసరా కానుక .. సంస్థ లాభాల్లోంచి 30శాతం వాటా ఇవ్వాలని ఆదేశం

Singareni employees

Singareni employees

KCR | Singareni: దసరా పండుగకు ముందే తెలంగాణ సీఎం కేసీఆర్ సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు శుభవార్త చెప్పారు. విజయదశమిలోపు సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సంస్థ లాభాల్లోంచి 30వాటాను అందజేయాలని ఆదేశించారు. సీఎం నిర్ణయం పట్ల కార్మికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దసరా(Dussehra)పండుగకు ముందే తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్ (KCR)సింగరేణి(Singareni)ఉద్యోగులు, కార్మికులకు శుభవార్త చెప్పారు. పండుగ కానుకగా సింగరేణి ఉద్యోగులకు కానుక ఇవ్వాలని నిర్ణయించారు. విజయదశమిలోపు సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సంస్థ లాభాల్లోంచి వాటాను అందజేయాలని ఆదేశించారు. సంస్థ లాభాల్లో 30 శాతం(30 Percent) వాటాను ఉద్యోగులకు చెల్లించాల‌న్నారు. అర్హులైన కార్మికుల‌కు మొత్తం దసరా కానుకగా 368 కోట్ల‌(368 Crores)ను సింగ‌రేణి సంస్థ చెల్లించ‌నుంది.

Free Ration: రేషన్ కార్డు కలిగిన వారికి కేంద్రం అదిరే శుభవార్త! కీలక ప్రకటన!

పండుగ పూట గుడ్ న్యూస్..

సింగరేణి కాలరీస్ సంస్థ, 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. సింగ‌రేణి లాభాల్లో 30 శాతం వాటా అంటే... ఈ ఏడాది కార్మికుల‌కు రూ.368 కోట్లు అంద‌నున్నాయి. సింగ‌రేణి సంస్థ లాభాల్లో వాటాను కార్మికుల‌కు ద‌స‌రా కానుక‌గా ఇస్తుండ‌టం ఈ సారి కొత్తేమీ కాకున్నా... గ‌తేడాది కంటే లాభాల వాటాను కేసీఆర్ సర్కారు 1 శాతం మేర పెంచింది.

ఈసారి 1శాతం పెంపు..

2020లో సంస్థ లాభాల్లో 28 శాతం వాటాను కార్మికుల‌కు ద‌స‌రా కానుకగా ఇవ్వ‌గా... 2021లో దానిని 29 శాతానికి పెంచారు. తాజాగా ఈ ఏడాది లాభాల్లో కార్మికుల వాటాను 30 శాతానికి పెంచారు. 2021 -22 సంవత్సరానికి గాను సింగరేణి కాలరీస్ సంస్థ సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని నిర్ణయించిన‌ సీఎం కేసీఆర్ గారికి ఉద్యోగుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత .

సీఎంకు కృతజ్ఞతలు..

దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత ఎక్కువ మొత్తంలో దసరా బోనస్ అందిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది అర్హులైన సింగరేణి కార్మికులకు 368 కోట్ల రూపాయలను అందించనుండటం గొప్ప విషయమని కార్మికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల శ్రమ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ మరింత ముందుకు సాగుతూ, దేశానికి వెలుగులు పంచాలని ఆకాంక్షిస్తున్నాట్లు కవిత తెలియజేశారు.

Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Singareni Collieries Company, Telangana News

ఉత్తమ కథలు