Home /News /telangana /

HYDERABAD TELANGANA CM KCR LETTER TO PRIME MINISTER MODI TO HELP MEDICINE STUDENTS WHO HAVE RETURNED FROM UKRAINE SNR

KCR LETTER:ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కి వచ్చిన మెడిసిన్‌ స్టూడెంట్స్‌కి సాయం చేయమని ప్రధానిని కోరిన కేసీఆర్

నరేంద్రమోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

నరేంద్రమోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

TELANGANA:ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా భారత్‌కు తిరిగొచ్చిన మెడిసిన్ స్టూడెంట్స్‌ భవితవ్యంపై ప్రధానికి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్. స్టూడెంట్స్‌కి పైచదువులకు ఇబ్బంది తలెత్తకుండా విద్యాసంవత్సరం వృధా కాకుండా మిగిలిన సెమిస్టర్‌ను భారత్‌లో పూర్తి చేసే విధంగా మెడికల్ ల్యాబ్‌లు, అదనపు సీట్లు కేటాయించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఇంకా చదవండి ...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) ప్రధాని నరేంద్రమోదీ(Modi)కి లేఖ రాశారు. ఉక్రెయిన్(Ukraine)-రష్యా (Russia)మధ్య యుద్ధం జరుగుతున్న నేపధ్యంలో భారతదేశాని(India)కి చెందిన సుమారు 20వేల మంది వైద్య విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధంగా మారినట్లుగా లేఖ(Letter)లో పేర్కొన్నారు సీఎం కేసీఆర్. అందులో దాదాపు 700మంది తెలంగాణకు చెందిన విద్యార్ధులు ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్నారు. యుద్ధ వాతావరణం కారణంగా వారంతా స్వదేశానికి విచ్చేశారు. అయితే వారి పైచదువులకు ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ(Telangana) రాష్ట్రంలో మెడికల్ ల్యాబ్ (Medical lab)ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు కేసీఆర్. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వాలని లేఖ ద్వారా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు కేసీఆర్. భారతదేశానికి వచ్చిన మెడిసిన్ స్టూడెంట్స్‌లో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. యుద్ధ కారణంగా తమ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందోన్న ఆందోళన ప్రతి ఒక్క విద్యార్ధి తల్లిదండ్రుల్లో ఉందన్నారు కేసీఆర్. విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు దెబ్బతినకుండా ఎంత మేరకు సాయం చేయగలిగితే అంత చేయాలని లేఖ ద్వారా కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు.

పెద్ద మనసు చేసుకోండి..
ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వేలాది మంది మెడిసిన్ స్టూడెంట్స్‌ విద్యాసంవత్సరం వృధా కాకుండా మిగిలిన సెమిస్టర్లను కంప్లీట్ చేసే విధంగా ఇండియాలోనే ఏదైనా మెడికల్‌ కాలేజీల్లో సీట్లు అలాట్ చేయాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్‌. విద్యార్ధుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి లేేఖను ప్రత్యేక విజ్ఞప్తిగా పరిగణించాలని కేసీఆర్‌ ప్రధానిని కోరారు.

ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన మెడిసిన్ విద్యార్ధులకు సాయం చేయమని ప్రధాని మోదీకి <a href='https://telugu.news18.com/tag/telangana/'>తెలంగాణ</a> సీఎం లేఖ | Telangana CM kcr letter to Prime Minister Modi to help medicine students who have returned from Ukraine,

విద్యార్ధులకు సాయం చేయండి..
ఇక తెలంగాణకు చెందిన 700 మంది వైద్యవిద్యను అభ్యసిస్తున్న స్టూడెంట్స్‌ కూడా కోర్సు పూర్తి కాకుండానే ఉక్రెయిన్‌ నుంచి తిరిగివచ్చినట్లుగా తెలంగాణ సీఎం లేఖ ద్వారా కేంద్రానికి గుర్తు చేశారు. అయితే వారి తదుపరి విద్యను అభ్యసించడానికి అవసరమయ్యే కాలేజీ ఫీజులు మొదల్కొని ఇతర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. విద్యార్ధులపై సానుభూతి చూపిస్తూ తమ అభ్యర్ధనపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని లేఖ ద్వారా కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్.
Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Narendra modi, Russia-Ukraine War

తదుపరి వార్తలు