Home /News /telangana /

HYDERABAD TELANGANA CM KCR INAUGURATED POLICE COMMAND CONTROL CENTER IN HYDERABAD SNR

Telangana : సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐసీసీసీ ప్రారంభం .. ఐదు టవర్లలో నిఘా వ్యవస్థ పటిష్టం

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Telangana: హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఐదు టవర్లలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భవనంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నేరస్తుల కదలికలను పసిగట్టడం నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా దోహదపడనుంది.

ఇంకా చదవండి ...
తెలంగాణ(Telangana) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(Inaugurated Police Command Control Center)ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో అత్యంత పకడ్బందీగా దీన్ని నిర్మించడం జరిగింది. ఆరేళ్ల క్రితం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న ఐకానిక్ భవనాన్ని గురువారం (Thursday)మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయన ప్రారంభించారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో దేశంలో అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ నిర్మించడం జరిగింది. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన భవన సముదాయం ఐదు టవర్ల రూపంలో నిర్మించారు.

హైఫై నిఘా కార్యాలయం..
ఏడు ఎకరాల స్తలంలో సుమారు 600వందల కోట్ల రూపాయలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడిన ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను దేశంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ నిర్మించారు. ఐసీసీసీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌కు ముందుగా పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

హైటెక్ పోలీస్‌ ఆఫీస్ ..
ప్రారంభోత్సవం సందర్భంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పూలతో అలంకరించారు. ప్రాంగణాన్ని మొక్కలతో ఆకపచ్చని వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. సీసీసీ ప్రారంభోత్సవం సందర్భంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.జంటనగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా నేరాలను పసిగట్టే విధంగా సుమారు లక్ష సీసీ కెమెరాల పనితీరును ఇక్కడ అనుక్షణం పర్యవేక్షించడం జరుగుతుంది. రాష్ట్ర నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ని ఏర్పాటు చేశారు.

చీమ చిటుక్కుమన్నా పట్టుకునే టెక్నాలజీ..
ఈ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో హోంమంత్రి, సీఎస్‌, డీజీపీతో పాటు అన్నీ కమిషనర్‌లకు ప్రత్యేక చాంబర్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 299కార్లు, 316 టూవీలర్లను పార్కింగ్ చేసుకునే విధంగా సౌకర్యం కల్పించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్​ నుంచే ఆపరేట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటికల్ సాఫ్ట్‌వేర్‌తో క్రైమ్‌ డేటాను సేవ్ చేయడం, ఒకేసారి లక్ష సీసీ కెమెరాల దృశ్యాలను చూసేందుకు వీలుగా అతి పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌ని ఏర్పాటు చేశారు.

అద్భుత నిర్మాణం..
18 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. 7 ఎకరాలు, 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. భవనం ఎత్తు 83.5 మీటర్లు. టవర్‌ ఏ లోని 18వ ఫ్లోర్‌లో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఉంది. 14, 15వ ఫ్లోర్‌లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఏడో అంతస్తులో సీఎస్‌, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి. టవర్‌ బి మొత్తాన్ని టెక్నాలజీ వింగ్‌కు కేటాయించారు.సాంకేతిక పరిజ్ఞానం వాడుకునే దిశగా 5 టవర్లు(ఏబీసీడీఈ) ఏర్పాటు చేశారు.
Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు