Home /News /telangana /

HYDERABAD TELANGANA CM KCR CONGRATULATES PV SINDHU FOR WINNING GOLD MEDAL IN COMMONWEALTH GAMES SNR

PV Sindhu | CM KCR : కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పీవి సింధుకు గోల్డ్ మెడల్ .. అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

(Photo Credit:Twitter)file

(Photo Credit:Twitter)file

PV Sindhu | CM KCR: కామన్‌వెల్త్ గేమ్స్‌లో మరో తెలుగుతేజం గోల్డ్ మెడల్ సాధించింది. ఉమెన్ సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు ప్రత్యర్ధికి చుక్కలు చూపించి బంగారు పతకం సాధించడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
భారత దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు(PV Sindhu)కామన్‌ వెల్త్ గేమ్స్‌(Commonwealth Games)లో బంగారు పతకం(Gold medal) సాధించారు. బర్మింగ్ హామ్‌లో జరుగుతున్న గేమ్స్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో కెనడా (Canada) క్రీడాకారిణి మిచెల్‌ లీ(Michelle Lee)ని ఓఢించిన పీవీ సింధు కామన్‌వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాలన్న తన కలను సొంతం చేసుకున్నారు. పీవీ సింధు బంగారు పతకం గెలవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)హర్షం వ్యక్తం చేశారు. పీవీ సింధును కేసీఆర్ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ(Telangana)కు చెందిన క్రీడాకారులు ఈవిధంగా పతకాలతో దేశానికి, రాష్ట్రానికి పేరు తేవడం గర్వించదగిన విషయమని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

CWG 2022: పంచ్‌లతో పతకాలు సాధించిన నిఖత్,హుస్సాముద్దీన్ ..కామన్‌వెల్త్ గేమ్స్‌లో నిజామాాబాద్ రత్నాలు


మా సింధు బంగారం..
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించి తన సత్తా చాటుకున్నారు. 2014 నుంచి కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో పార్టిసిపేట్ చేస్తున్నప్పటికి సింగిల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాలన్న తన చిరకాల కోరికను ఈసారి నెరవేర్చుకున్నారు. బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా సోమవారం మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్లో సింధు 21-15, 21-13తో మిచెల్ లీ (కెనడా)పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ చాంపియన్ తో పాటు డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు తాజాగా కామన్వెల్త్ గేమ్స్ లోనూ స్వర్ణ పతకాన్ని అందుకుంది. 2014లో జరిగిన కామన్వెల్త్ లో సింధు కాంస్యాన్ని అందుకోగా.. గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో రజత పతకాన్ని సాధించింది. కామన్ వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు స్వర్ణం పతకం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పివి సింధుకు సీఎం శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.



శభాష్ సింధు..
బర్మింగ్‌ హమ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో గోల్డ్ సాధించి సింధు గోల్డ్ గెలవడంతో భారత్ పతకాల సంఖ్య 56కు చేరుకుంది. ఈ ఈవెంట్ లో భారత్ కు ఇది 19వ గోల్డ్ మెడల్ కావడం విశేషం. కామన్వెల్త్ గేమ్స్ హిస్టరీలో భారత్ తరఫున సింధు 200వ పతకం నెగ్గిన ప్లేయర్ గా నిలిచింది.  కామన్వెల్త్ గేమ్స్ చివరి రోజు అయిన సోమవారం బ్యాడ్మింటన్ లో భారత్ కు మరో రెండు గోల్డ్ మెడల్స్ దక్కే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్ తో పాటు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనున్నారు. దాంతో పాటు పురుషుల విభాగంలో కూడా భారత హాకీ జట్టు ఆస్ట్రేలియాతో స్వర్ణ పతకం కోసం పోటీ పడనుంది.



ప్రత్యర్ధికి చుక్కలు చూపించిన సింధు..
గత రెండు కామన్వెల్త్ గేమ్స్ లోనూ స్వర్ణాన్ని చేజిక్కించుకోలేకపోయిన సింధు.. ఈసారి ఆ అవకాశాన్ని వదిలిపెట్టకూడదనే పట్టుదలతో కనిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచే సింధు ప్రత్యర్థి మిచెల్ పై ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా పాయిట్లు సాధిస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి సులభంగా విజయం సాధించింది. ఈసారి కామన్‌వెల్త్ గేమ్స్‌లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన జరీన్‌ నిఖత్‌తో పాటు హుస్సాముద్దీన్ అనే యంగ్ బాక్సర్‌ కూడా కాంస్యం ప‌థ‌కం సాదించారు. వీళ్లిద్దరూ బాక్సింగ్‌ సంషొద్దీన్ అనే కోచ్ దగ్గరే ఓన‌మాలు నేర్చు కున్నారు. ఉమెన్స్ బాక్సింగ్‌లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించగా..సంస‌ముద్దీన్ కుమారుడు హుస్సాముద్దీన్ తండ్రి వద్దే శిక్షణ పొంది జూనియర్ స్థాయిలో.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు. వీరిద్దరికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.
Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Commonwealth Game 2022, Pv sindhu, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు