Home /News /telangana /

HYDERABAD TELANGANA CM KCR CONDOLES TO THE FAMILIES OF KARNATAKA BUS ACCIDENT VICTIMS SNR

Telangana | Kcr : కర్నాటక బస్సు ప్రమాద మృతులకు కేసీఆర్‌ 3లక్షల పరిహారం .. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలకు ఆదేశం

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Telangana | Kcr:కర్నాటక బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రదిగ్భ్రాంతి చెందారు. మృతుల సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలందేలా చూడాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కేసీఆర్.

ఇంకా చదవండి ...
గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సు కర్నాటక(Karnataka Bus fire)లో ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో చనిపోయిన పది మందికిపైగా మృతి చెందారు. 25మంది గాయపడ్డారు. మృతుల్లో తెలంగాణ(Telangana) రాష్ట్రం హైదరాబాద్‌(Hyderabad) వాసులు 8మంది ఉన్నారు. రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ (kcr)తీవ్రదిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల పట్ల తన సంతాపాన్ని(Condolences), బాధితుల కుటుంబాలకు తన తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ అధికారయంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. బాధితులకు అవసరమైన వైద్య, ఇతర సహాయక చర్యలు వేగవంచం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి సైతం కర్నాటక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

సీఎం కేసీఆర్‌ సంతాపం..
శుక్రవారం ఉదయం కర్నాటక రాష్ట్రం కాల్‌బుర్గీలో అతివేగంతో వస్తున్న బస్సు అదుపుతప్పిన ఓ టెంపో వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత కల్వర్టును ఢీకొట్టి.. రోడ్డు దిగువకు దూసుకెళ్లింది. ఆ వెంటనే డీజిల్ లీకై.. పెద్ద ఎత్తు మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నికి ఆహుతయింది. హైదరాబాద్‌కి చెందిన అర్జున్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన కుమార్తె బర్త్ డే వేడుకలను గోవాలో ప్లాన్ చేశాడు. అందుకోసం కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు మొత్తం కలిసి 30మందికిపైగా గత నెల 29న గోవాకు వెళ్లారు. బర్త్‌ డే సెలబ్రేషన్స్ ముగియడంతో హైదరాబాద్‌ తిరుగు ప్రయాణమయ్యారు. గురువారం రాత్రి గోవాలో బయల్దేరిన బస్సు శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో కల్బుర్గి జిల్లా కమలాపూరం దగ్గర హుబ్బళ్లి-ధార్వాడ బైపాస్ రోడ్డుపై ప్రమాదానికి గురైంది. కర్నాటక రాష్ట్రంలోని కలబురగి బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల పరిహారాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

విషాదాన్ని నింపిన బర్త్‌ డే పార్టీ..
ప్రమాదంలో బస్సు డీజిల్ ట్యాంకర్‌ లీకవడంతో మంటలు అంటుకొని క్షణాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా మంటలు వ్యాపించాయి. ప్రమాద తీవ్రత గమనించిన ప్రయాణికులు కొందరు కిటికీలు, డోర్లు తెరుచుకొని కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అందులో కొందరు తప్పించుకునే క్రమంలోనే మంటల్లో కాలిపోయారు. ప్రాణభయంతో బస్సులోని ప్రయాణికులు మంటల్లో కాలిపోతూ చేసిన హాహాకారాలు చేశారు. మంటల్లో సజీవదహనమయ్యారు. కేవలం మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లోని గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వాళ్లు దుర్ఘటనతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

గమ్యం చేరుకునేలోపే సజీవదహనం..
సమాచారం అందిన వెంటనే.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన మూడు ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మరో 25 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సహాయ చర్యలను కలబురిగి గ్రామీణ ఎమ్మెల్యే బసవరాజ్ మతిమూడ్ పర్యవేక్షిస్తున్నారు.

రెండు ఫ్యామిలీలకు చెందిన సభ్యులు..
కర్నాటక బస్సు ప్రమాద మృతుల్లో 8మంది హైదరాబాద్‌కి చెందిన వాళ్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. కేవలం బర్త్‌ డే పార్టీ కోసం రెండు కుటుంబాలకు చెందిన వాళ్లు ఉన్నారు. అందులో ఒక ఫ్యామిలీలోని 11 మంది, మ‌రో కుటుంబంలో 21 మంది వెళ్లారు. డ్రైవ‌ర్‌తో పాటు ఇద్ద‌రు క్లీన‌ర్లు ఉన్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Karnataka, Telangana Government

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు