హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulayam Singh Yadav | KCR: యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌కు కేసీఆర్ నివాళి .. రేపు యూపీకి తెలంగాణ సీఎం

Mulayam Singh Yadav | KCR: యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌కు కేసీఆర్ నివాళి .. రేపు యూపీకి తెలంగాణ సీఎం

Mulayam Singh,kcr (file)

Mulayam Singh,kcr (file)

Mulayam Singh Yadav| kcr: ములాయం సింగ్‌ యాదవ్‌ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ములాయం సింగ్ యాదవ్‌కు నివాళులర్పించడానికి, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంగళవారం కేసీఆర్ ఉత్తరప్రదేశ్‌కు బయల్దేరుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాజకీయ కురువృద్దుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అపార అనుభవం కలిగిన నేతగా సమాజ్‌వాది పార్టీ ద్వారా దేశ నేతగా ఎదిగిన ములాయం సింగ్‌ యాదవ్‌ మరణాన్ని చింతిస్తూ ఆయన కుమారుడు అఖిలేష్‌యాదవ్‌తో పాటు కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కేసీఆర్ సంతాపం..

యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్‌ మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 82సంవత్సరాల ములాయం గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ములాయం సింగ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

రాజకీయ కురువృద్ధుడికి నివాళి..

తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ములాయంసింగ్ యాదవ్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అపార అనుభవాన్ని గడించిన కురువృద్ధుడి మరణాన్ని చింతిస్తూ ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్‌తో పాటు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలియజేశారు కేటీఆర్ . ములాయంసింగ్ మరణం నిజంగా భారత రాజకీయాల్లో శకానికి ముగింపు లాంటిదని పేర్కొన్నారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, అభిమానులందరికి మనోస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

కుటుంబ సభ్యులకు సంతాపం..

యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు. సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎంగా పనిచేసిన ములాయం సింగ్‌ యాదవ్ దేశానికి చేసిన కృషి అపారమైనదిగా పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు హరీష్‌రావు. మలాయం సింగ్ కుటుంబ సభ్యులు, సమాజ్‌వాది పార్టీ శ్రేణులకు తన హృదయపూర్వక సానుభూతిని ప్రకటించారు.

రేపు యూపీకి కేసీఆర్..

ములాయం సింగ్ యాదవ్‌కు నివాళులర్పించడానికి, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంగళవారం కేసీఆర్ ఉత్తరప్రదేశ్‌కు బయల్దేరుతున్నారు.

First published:

Tags: CM KCR, Samajwadi Party, Telangana News

ఉత్తమ కథలు