హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR| Ramadan 2022: బెంగళూరులో అల్లర్లు చూస్తున్నాం.. మంచి పద్దతి కాదు.. ఇప్తార్​ విందు సందర్భంగా సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలు

CM KCR| Ramadan 2022: బెంగళూరులో అల్లర్లు చూస్తున్నాం.. మంచి పద్దతి కాదు.. ఇప్తార్​ విందు సందర్భంగా సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

తెలంగాణలో ప‌రిస్థితులు అద్భుతంగా వున్నాయని.. కేంద్రంలో మాత్రం ప‌రిస్థితులు బాగో లేవని  సీఎం కేసీఆర్ (kcr) పేర్కొన్నారు. రంజాన్ (ramadan 2022) పర్వదినాన్ని పురస్కరించుని జరిగిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...

  తెలంగాణలో ప‌రిస్థితులు అద్భుతంగా వున్నాయని.. కేంద్రంలో మాత్రం ప‌రిస్థితులు బాగో లేవని  సీఎం కేసీఆర్ (Telangana CM KCR) పేర్కొన్నారు. రంజాన్ (ramadan 2022) పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ (Hyderabad)లోని ఎల్‌బీ స్టేడియంలో (lb stadium) తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు (Iftar dinner in Hyderabad)లో సీఎం పాల్గొన్నారు. కేవ‌లం తెలంగాణ ముస్లిం ప్ర‌జ‌ల‌కే కాకుండా దేశంలోని ముస్లింలంద‌రికీ రంజాన్ శుభాకాంక్ష‌లు (KCR Ramadan wishes) తెలిపారు కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. కేంద్రంలో కొంత గ‌డ‌బిడ వుందని.. అక్క‌డ కొంత రోగం వుందని, దానికి చికిత్స (Treatment) చేయాల్సిన అవ‌స‌రం వుందని ఆయన తెలిపారు. తెలంగాణ కూడా దేశంలో భాగ‌మేనని.. దేశం, రాష్ట్రం (State) బాగుంటేనే ప్ర‌జ‌లంద‌రూ బాగుంటారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 2014లో రాష్ట్ర ప‌ర్ క్యాపిటా ఇన్‌కమ్‌తో పోలిస్తే, ఇప్పుడు పెరిగిందని సీఎం గుర్తుచేశారు. మ‌న ప‌ర్ క్యాపిటా ఇన్‌కమ్‌లో స‌గం కూడా దేశానిది లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

  ఈ సందర్భంగా కేసీఆర్​ (KCR) మాట్లాడుతూ.. ‘‘ ఇఫ్తార్ విందుకు హాజ‌రైన ప్ర‌తినిధులు, ముస్లిం మ‌త పెద్ద‌లంద‌రికీ న‌మ‌స్కారం. గ‌త కొన్నేళ్ల క్రితం తెలంగాణ (Telangana) వాతావ‌ర‌ణం చాలా ఇబ్బందిగా వుండేది. క‌నీసం తాగ‌డానికి నీళ్లు కూడా లేని ప‌రిస్థితి. వ్య‌వ‌సాయానికి కూడా ఇవ్వ‌డానికి నీళ్లు లేవు. కానీ.. మీ అంద‌రి స‌హ‌కారం వ‌ల్ల ప‌రిస్థితి మారిపోయింది. తెలంగాణ అభివృద్ధి దిశ‌గా అడుగులు వేస్తోంది.  దేశం మొత్తం నేడు అంధ‌కారంలో వుంది. కానీ తెలంగాణ మాత్రం విద్యుత్ కాంతుల‌తో విరాజిల్లుతోంది.

  కూల్చ‌డం సుల‌భం. నిర్మించ‌డ‌మే క‌ష్టం..

  మైనారిటీ (Minority) పిల్ల‌ల కోసం అద్భుత‌మైన రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల‌ను నిర్మించాం. అన్ని వ‌స‌తులూ క‌ల్పించాం. తెలంగాణ ప్ర‌భుత్వం (Government of Telangana) చేసిన తీరుగానే.. దేశం మొత్తం కూడా ఇదే విధానాన్ని అవ‌లంబించాలి. దేనినైనా కూల్చ‌డం చాలా సుల‌భం. నిర్మించ‌డ‌మే చాలా క‌ష్టం. బెంగ‌ళూరులో ఎలాంటి అల్ల‌ర్లు జ‌రుగుతున్నాయో చూస్తున్నాం. దేశ‌మంతా ఇలాగే న‌డుస్తోంది. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు. ప్ర‌జ‌ల‌కు కూడా ఇది అర్థ‌మ‌వుతోంది. దీనిని బాగు చేయాల్సిన అవ‌స‌రం వుంది. దేవుడు తెలంగాణ‌ను ఎలాగైతే అభివృద్ది ప‌థంలో న‌డిపించి, ఈ స్థాయికి తీసుకొచ్చారో.. దేశం వైపు కూడా మ‌మ్మ‌ల్ని అలాగే న‌డిపిస్తార‌న్న న‌మ్మ‌కం వుంది. అందులో అనుమాన‌మే లేదు. మ‌నకు కూడా ఈ దేశం కోసం ప‌నిచేసే ఛాన్స్ వ‌స్తుంది.

  24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్..

  ఓ నిర్మాణాత్మ‌క అభివృద్ధి ప‌థంలో తెలంగాణ ప‌య‌నిస్తున్నందుకు ఎంతో గ‌ర్వంగా వుంది. నాణ్య‌మైన విద్యుత్‌ను అందిస్తున్నందుకు ఆనందంగా వుంది. దేశం మొత్తంలోనే 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతినొందింది. ప్ర‌తి రంగానికీ నాణ్య‌మైన విద్యుత్‌నే అందిస్తున్నాం. ఇది ఏమాత్రం స‌రిపోదు. ఇంకా అభివృద్ధి సాధించాల్సి వుంది. ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నాం.

  2014 లో రాష్ట్ర త‌ల‌స‌రి ఆదాయంతో పోలిస్తే, ఇప్పుడు పెరిగింది. మ‌న త‌ల‌స‌రి ఆదాయంలో స‌గం కూడా దేశానిది లేదు. కేంద్రం (Central government) బ‌ల‌హీనంగా వుంటే రాష్ట్రం కూడా బ‌లహీనంగానే వుంటుంది. ఏ ప‌రిస్థితుల కార‌ణంగానైనా కేంద్రంలో గ‌డ‌బిడ వుంటే క‌చ్చితంగా దానిని ఆపాలి. దానిని గాడిలో పెట్టాలి. అది మ‌న బాధ్య‌త‌. దేశాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇబ్బందులు పాలుకానివ్వ‌దు. నాకు పూర్తి విశ్వాసం వుంది. ఎక్క‌డైనా ఇబ్బందులు వ‌స్తే దానిని అధిగ‌మించే శ‌క్తి ఆ దేవుడు ఇస్తాడు.

  ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు మ‌హ‌మూద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్, స‌త్య‌వ‌తి రాథోడ్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం మత పెద్ద‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చిన్నారుల‌కు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తోఫా అందించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Hyderbad, Ramadan 2022, Telangana, Trs

  ఉత్తమ కథలు