సీఎం కేసీఆర్ (CM Kcr) అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం అయింది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నిన్న టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ ఇచ్చిన పత్రాలపై కేసీఆర్ (CM Kcr) సంతకం చేశారు. తెలంగాణ భవన్ లో BRS ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఈ క్రమంలో TRS BRS మారిన తరువాత మొదటి కేబినెట్ భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈనెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ (CM Kcr) నిర్ణయించారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో ఎలాంటి ధోరణితో ముందుకెళ్లాలి. కేంద్రం వ్యతిరేక విధానాలను ప్రజలకు అసెంబ్లీ ద్వారా చెప్పాలని గులాబీ బాస్ యోచిస్తున్నారు. అలాగే రైతుబంధు నిధుల జమ, ధాన్యం కొనుగోళ్లు, దళిత బంధు, సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకునే అంశాలపై ప్రధాన చర్చ జరుగనుంది.
ఈనెల 15 నుండి రైతుబంధు నిధుల జమ?
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా 'రైతుబంధు' పథకం తీసుకొచ్చింది. ఈ స్కిం ద్వారా ఎకరానికి రూ.5 వేలు పెట్టుబడి కోసం ఇస్తుంది. ఇక ప్రస్తుతం రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కేసీఆర్ రైతుబంధుపై కీలక ప్రకటన చేశారు. మరో 10-12 రోజుల్లోనే రైతుబంధు డబ్బులు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. దీనితో డిసెంబర్ 15 నుండి రైతుబంధు నిధులు జమ కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం రైతుబంధుపై పూర్తి క్లారిటీ రానుంది.
సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త..
ఇక ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించి అర్హులకు పంపిణీ చేస్తుంది. అయితే ఇది ఒక ప్లేస్ లో ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. కానీ సొంత జాగా ఉండి ఇళ్లు లేని నిరుపేదలకు కేసీఆర్ శుభవార్త చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు ప్రభుత్వమే ఇవ్వనుండగా..దానికి సంబంధించిన విధివిధానాలపై నేడు స్పష్టత రానుంది.
ధాన్యం కొనుగోళ్లు, దళితబంధు పై చర్చ..
ఇక రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై భేటీలో చర్చించనున్నారు. అలాగే దళితబంధు పంపిణీకి నిధులపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రంపై వ్యతిరేక గళాన్ని ప్రజలకు తెలియజేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు కేడర్ కు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cabinet Meeting, CM KCR, Dalitha Bandhu, Kcr, KCR New Party, Rythubandhu, Telangana, Telangana cabinet, Telangana Rythu Bandhu Scheme