హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Budget 2023-24: రుణమాఫీ, దళితబంధుపై అసెంబ్లీలో కీలక ప్రకటన..పూర్తి కేటాయింపులు ఇవే..

Telangana Budget 2023-24: రుణమాఫీ, దళితబంధుపై అసెంబ్లీలో కీలక ప్రకటన..పూర్తి కేటాయింపులు ఇవే..

అసెంబ్లీలో బడ్జెట్ వివరాలు వెల్లడిస్తున్న మంత్రి హరీష్ రావు

అసెంబ్లీలో బడ్జెట్ వివరాలు వెల్లడిస్తున్న మంత్రి హరీష్ రావు

రూ. 2,90,396 కోట్లతో తెలగాణ బడ్జెట్‌ను నేడు ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లుగా ఉంది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు, రైతుబంధు సహా కీలక పథకాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ ప్రభుత్వం మరో భారీ బడ్జెట్ (Telangana Budget 2023) ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శాసనసభలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టగా..శాసనమండలిలో వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాల్గోసారి మంత్రులు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇక అంతకుముందు వెంకటేశ్వర స్వామికి పూజలు చేసిన మంత్రి హరీష్ రావు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి మంత్రులు బడ్జెట్ ప్రతులను అందించారు. అక్కడి నుంచి మంత్రులు నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ కేసీఆర్ కు పాదాభివందనం చేశారు. ఆ తరువాత బడ్జెట్ ప్రతులను సీఎంకు అందజేశారు. కాగా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉండనుండగా రాష్ట్ర బడ్జెట్ పై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే.

రూ. 2,90,396 కోట్లతో తెలగాణ బడ్జెట్‌ను నేడు ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లుగా ఉంది.

బడ్జెట్ లో పథకాలకు 2023-24 కేటాయింపులు ఇలా..

ఆసరా ఫించన్ల కోసం రూ.12 వేల కోట్లు

దళితబంధు కోసం రూ.17,700కోట్లు

రైతుబంధుకు రూ.1575 కోట్లు

రైతుభీమాకు రూ. 1589 కోట్లు

ఎస్సి ప్రత్యేక నిధి రూ.36,750 కోట్లు

ఎస్టీ ప్రత్యేక నిధి రూ.15,233 కోట్లు

బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు

మహిళా శిశు సంక్షేమం కోసం రూ.2,131 కోట్లు

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక‌ పథకాలకు రూ. 3,210 కోట్లు

రుణమాఫీ కోసం రూ.6385 కోట్లు

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి రూ.12000 కోట్లు

ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1463 కోట్లు

ప్రణాళిక విభాగానికి రూ.11,495 కోట్లు

పల్లె, పట్టణ ప్రగతికి రూ.4834 కోట్లు

కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ పథకానికి రూ. 200 కోట్లు

శాఖలకు కేటాయింపులు ఇవే..

వ్యవసాయానికి కేటాయింపులు రూ.26,831 కోట్లు

నీటి పారుదల శాఖకు రూ.26,885 కోట్లు

విద్యుత్ కేటాయింపులకు రూ.12,727

హోం శాఖకు రూ.9599 కోట్లు పరిశ్రమల శాఖకు రూ.4037 కోట్లు

మున్సిపల్ శాఖకు రూ.11,372 కోట్లు

పంచాయతీ రాజ్ శాఖకు రూ.31,426 కోట్లు హరితహారం పథకానికి రూ.1471 కోట్లు

న్యాయశాఖకు రూ.1665 కోట్లు

రూ.2,56,958.51 కోట్లతో గతేడాది బడ్జెట్ (2022-23) కేటాయింపులు ఇలా..

వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు

ఆసరా పెన్షన్లకు రూ.11,728 కోట్లు

కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ కు రూ.2,750 కోట్లు

డబుల్ బెడ్రూమ్ ల కోసం రూ.12,000 కోట్లు

దళితబంధు రూ.17,700 కోట్లు.

మన ఊరు- మన బడి రూ.7,289 కోట్లు.

ఎస్టీల సంక్షేమం కోసం రూ.12,565 కోట్లు

పట్టణ ప్రగతి కోసం రూ.1,394 కోట్లు

బీసీ సంక్షేమం కోసం రూ.5,698కోట్లు

బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.177 కోట్లు

పల్లె ప్రగతి రూ.3330 కోట్లు

ఫారెస్ట్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు

హరితహారంకు రూ.932 కోట్లు

రోడ్లు, భవనాల కోసం రూ.1542 కోట్లు

First published:

Tags: Minister harishrao, Telangana, Telangana Budget

ఉత్తమ కథలు