హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS ICET-2022: టీఎస్‌ ఐసెట్‌ ఫలితాల విడుదల వాయిదా .. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే

TS ICET-2022: టీఎస్‌ ఐసెట్‌ ఫలితాల విడుదల వాయిదా .. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TS ISET Results : తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS ICET-2022) ఫలితాలు ఆలస్యం కానున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్ట్ 22 సోమవారం విడుదల కావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS ICET-2022) ఫలితాలు ఆలస్యం కానున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్ట్ 22 (August 22)సోమవారం (Monday) విడుదల కావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి(Telangana Council of Higher Education)అధికారులు ప్రకటించారు.అధికారిక సమాచారం ప్రకారం ఐసెట్‌ ఫలితాలు శనివారం(Saturday)విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Animation Internships: స్టూడెంట్స్‌కు బెస్ట్ కెరీర్ ఆప్షన్ యానిమేషన్‌.. ఈ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్స్ ఇవే..ఐసెట్ ఫలితాలు వాయిదా..

ఐసెట్‌ ద్వారా ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశ అర్హత కోసం తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET - 2022) టెస్ట్ ఈసంవత్సరం జులై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించారు. ఈఏడాది ఐసెట్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 75,958 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.ఫలితాలు వాయిదా పడినట్లుగా ప్రకటించిన అధికారులు ఐసెట్ రిజల్ట్స్ ప్రకటన అనంతరం https://icet.tsche.ac.inలో చెక్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

సాంకేతిక లోపం వల్లే...

విద్యార్ధులు పుట్టిన తేది, రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ నమోదు చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET - 2022)ఎగ్జామ్స్‌ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఆన్సర్‌ కీని కూడా ఆగస్ట్‌ 4వ తేదిన విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే ఫలితాలతో పాటు తుది ఆన్సర్‌ కీని ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు. టీఎస్ ఐసెట్ పరీక్ష ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ మీడియంలో నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.

Published by:Siva Nanduri
First published:

Tags: Telangana News, TS ICET 2022

ఉత్తమ కథలు