హోమ్ /వార్తలు /తెలంగాణ /

political war : ఎవరిది తప్పో తేల్చుకుందాం...కరోనా పరిస్థితికి నువ్వుంటే ..నువ్వంటున్న బీజీపీ, టీఆర్ఎస్‌లు

political war : ఎవరిది తప్పో తేల్చుకుందాం...కరోనా పరిస్థితికి నువ్వుంటే ..నువ్వంటున్న బీజీపీ, టీఆర్ఎస్‌లు

బీజేపీ , టీఆర్ఎస్‌ల  
మాటల యుద్దం,

బీజేపీ , టీఆర్ఎస్‌ల మాటల యుద్దం,

hyderabad :రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై బీజేపీ , టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్దం మొదలైంది. పరిస్థితికి నువ్వుంటే నువ్వంటూ విమర్శలు దిగారు. మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ అర్వింద్ కుమార్ , ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు.


తెలంగాణలో కరోనా రాజకీయం మొదలైంది. ఓవైపు ప్రజలు కరోనా నుండి ఎలా భయటపడాలనే ఆందోళణలో ఉంటే మరోవైపు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది. రాష్ట్ర్రంలో పరిస్థితికి కారణం నువ్వంటే నువ్వంటు విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడితో పాటు కేంద్రం తీసుకునే నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపుడుతోంది. ముఖ్యంగా కోవీషీల్డ్ టీకా ధరలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఓకే దేశం ఒకే ట్యాక్సి అంటున్న కేంద్రం టీకా విషయంలో ఒకే ధరను ఎందుకు అమలు చేయలేక పోతుందంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీంతో పాటు ఆక్సిజన్ కొరతకు కూడ కేంద్రం భాద్యత వహించాలంటూ ఆయన తీవ్రంగా విరుచుకపడ్డారు. మరోవైపు వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం కేంద్రం తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రం కనీసం పరిస్థితిపై సమీక్ష చేయడంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

దీంతో రాష్ట్ర్ర బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొట్టారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం కరోనాను పట్టించుకోకుండా వదిలివేసిందని అందుకు పరిస్థితి చేయిదాటి పోతుందని స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ అర్వింద్ కుమార్‌లు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడ కరోనా వ్యాప్తి చేందకుండా తీసుకోవాల్సిన చర్యలపై కనీసం ఓ సమీక్ష కూడ నిర్వహించలేదని విమర్శించారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వ దవాఖానల్లో కనీస అవసరాలు లేవని , సరైన బెడ్స్ లేకపోవడంతో పాటు ఐసీయు కేంద్రాలు కూడ లేవని దుయ్యాబట్టారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడి గేట్లు తెరిచారని విమర్శించారు. కరోనా మరణాలపై రాష్ట్రం తప్పుడు లెక్కలు చూపిస్తోందని, అన్నారు. ఇతర రాష్ట్రాలు కరోనా పరిస్థితులపై సరైన వివరణ ఇవ్వడంతోనే వాటికి సరైన మందులు, కావాల్సిన ఆక్సిజన్ సదుపాయాన్ని కేంద్రం కల్పించిందని , కాని తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా సమాచారాన్ని కేంద్రంతో పంచుకోవడంతో వైఫల్యం చెందిందని వారు తీవ్రంగా మండిపడ్డారు. కనీసం రాష్ట్రానికి ఎంత ఆక్సిజన్ అవరసరమో కూడ రాష్ట్ర అధికారులకు , ప్రజాప్రతినిధులకు తెలియదని అన్నారు. ఇక రెమిడెసివర్ విషయంలో మంత్రి కేటీఆర్ మాటలకు , మరియు ఈటల రాజేందర్ మాటలకు పొంతన లేకుండా పోతుందని అన్నారు. వారిలో ఎవరి మాటలు నిజమో తేల్చుకోవాలని చెప్పారు.

First published:

Tags: Bjp, Corona, Dharmapuri Arvind, KTR

ఉత్తమ కథలు