తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్(Bandi Sanjay)కు రాష్ట్ర మహిళా కమిషన్( Women's Commission)నోటీసులు(Notice) పంపింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla kavitha)పై ఈడీ నోటీసులు పంపిన సందర్భంగా బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సుమోటోగా నోటీసులు పంపింది. బండి సంజయ్ వ్యక్తిగతంగా తమ ముందుకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొనడం జరిగింది. కవితను అరెస్ట్ చేస్తారా అని వేసిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానంపై అటు బీఆర్ఎస్ శ్రేణులు, భారత జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.
అనుచిత వ్యాఖ్యలపై నోటీసులు..
లిక్కర్ స్కాం కేసులో కవితక్కను అరెస్టు చెయ్యకపోతే ముద్దు పెట్టుకుంటారా అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని మహిళా కమిషన్ నోటీసులు పంపడం జరిగింది. మరోవైపు బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అయనపై చర్యలు తీసుకోవాలని నిరసనలకు దిగారు.
Bandi Sanjay’s comments on BRS MLC Smt Kavitha is a new low in BJP’s brand of politics.@NCWIndia @DrTamilisaiGuv pic.twitter.com/CbiA0Yg827
— Mohammed Mahmood Ali (@mahmoodalitrs) March 11, 2023
మాటలు మంటలు..
మరోవైపు ఢిల్లీలో కూడా బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, జాగృతి నేతలు రోడ్డెక్కారు. ఈవిషయంలో బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్సీ కవిత గారిని ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల మీద భగ్గుమన్న తెలంగాణ. pic.twitter.com/SSkP2ZPnxY
— BRS Party (@BRSparty) March 11, 2023
భగ్గుమంటున్న బీఆర్ఎస్ వర్గాలు...
ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల మీద తెలంగాణ వ్యాప్తంగా మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. అటు ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర 144సెక్షన్ విధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.