హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: సైబ‌ర్ క్రైమ్స్ లో తెలంగాణ టాప్.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో షాకింగ్ ఫాక్ట్స్ ..         

Telangana: సైబ‌ర్ క్రైమ్స్ లో తెలంగాణ టాప్.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో షాకింగ్ ఫాక్ట్స్ ..         

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: తెలంగాణలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన షాకింగ్ విషయాలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

M. Balakrishna, News 18, Hyderabad


తెలంగాణలో రోజు రోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరగటం తీవ్ర ఆందోళన కల్గిస్తుంది. దీనిపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో షాకింగ్ ఫాక్ట్స్ ను  బయటపెట్టింది.  సైబ‌ర్ క్రైమ్స్ లో తెలంగాణ తొలి స్థానంలో ఉన్నట్లు  నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది.తెలంగాణాలో  రోజు రోజుకి సైబ‌ర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ప్ర‌జ‌ల్లో ఏ స్థాయిలో అవ‌గాహాన తీసుకొచ్చిన సైబ‌ర్ నేర‌గాళ్లు మాత్రం త‌మ దారి మార్చుకుంటూ సైబ‌ర్ క్రైమ్స్ కు పాల్ప‌డుతున్నారు. గ‌తంలో ముఖ్యంగా ఓటీపీ ద్వారా సైబ‌ర్  క్రైమ్స్ కు పాల్ప‌డితే ఇప్పుడు రూట్ మార్చి వివిధ ప‌ద్ద‌తుల్లో అకౌంట్స్ కొల్ల‌గొడుతున్నారు సైబ‌ర్ నేర‌గాళ్లు. తాజాగా నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన నివేధిక చూస్తే దేశంలో ఈ సైబ‌ర్ నేరాళ్లు ఏస్థాయిలో పెరిగిపోతున్నాయో అర్ధ‌మ‌వుతుంది.


ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సైబ‌ర్ నేరగాళ్లు అధికంగా జ‌రుగుతున్నాయ‌ని రికార్డులు చెబుతున్నాయి. ముఖ్యంగా దేశంలో తెలంగాణ ఈ సైబ‌ర్ నేరాలు జ‌రిగే న‌గ‌రాల్లో  తెలంగాణ నంబర్ వ‌న్ లో స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన తాజా 'క్రైమ్ ఇన్ ఇండియా-2021' నివేదిక ప్రకారం, 2021లో దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే సైబర్ క్రైమ్ కేసులలో 105% పెరుగుదలతో, తెలంగాణ మొత్తం సైబర్ క్రైమ్ కేసులలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. NCRB విడుద‌ల చేసిన నివేదికలో సంచలన విష‌య‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 10,000కు పైగా సైబర్ నేరాలు అంటే 10,303 నమోదైన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎన్‌సీఆర్‌బీ డేటా వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020లో 86%కేసులు ప‌రంగా చూసుకుంటే 5,024 సైబ‌ర్ కేసులు న‌మోదయ్యాయి.అయితే ఇలా సైబర్ క్రైమ్ కేసులు భారీ స్థాయిలో పెరగడం ఇది రెండోసారి అని అంటున్నారు అధికారులు. సైబర్ నేరాల్లో ఎక్కువ శాతం అంటే దాదాపు 7,003 కేసులు కమ్యూనికేషన్‌కు సంబంధించిన మోసాలకు సంబంధించినవే అని నివేదిక వెల్ల‌డించింది. ఇదిలా ఉంటే రాజస్థాన్ ఈ ఆర్థిక నేరాల విషయంలో దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. 2020తో పోలిస్తే 2021లో కేటగిరీలో 60% పెరుగుదల కనిపించింది ఈ రాష్ట్రంలో. మహిళలపై నేరాల విష‌యంలో, తెలంగాణ‌ రాష్ట్రం 2021లో 17% కేసులు పెరిగాయ‌ని నివేదిక వెల్ల‌డించింది. మ‌హిళ‌ల‌పై జరుగుతున్న నేరాల విష‌యంలో తెలంగాణ‌ దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది. మహిళలపై నేరాలకు సంబంధించిన 20,865 కేసులలో 45% భర్తల క్రూరత్వానికి సంబంధించినవి కావడం ఇక్క‌డ చెప్పుకోవాల్సిన విష‌యం.


తెలంగాణ రాష్ట్రంలో కూడా 823 రేప్ కేసులు నమోదయ్యాయి, అత్యాచార కేటగిరీలో 12వ ర్యాంక్ వచ్చింది. 2021లో 2020తో పోలిస్తే 21% కేసుల పెరుగుదలతో సిటిజన్‌లపై నేరాల్లో మూడో స్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం. వీటితోపాటు దొంగతనం, మోసం, గొడ‌వ‌లు, క‌బ్జా కేసులు వృద్ధులపై జ‌రిగిన‌ నేరాలు 2021లో రాష్ట్రంలో గత ఏడాది కంటే 55,494 కేసులు ఎక్కువ న‌మోదైయ్యాయి. తెలంగాణకు సంబంధించి మొత్తం పెండింగ్‌లో కేసులు 22% శాతంగా ఉంద‌ని నివేదిక వెల్ల‌డించింది. తెలంగాణ రాష్ట్రంలో నేరాల రేటు 70.1% తో దేశంలో ఆరవ స్థానంలో ఉందని నివేదిక తెలిపింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, CYBER FRAUD, Hyderabad news, ONLINE CYBER FRAUD, Telangana News

ఉత్తమ కథలు