Home /News /telangana /

HYDERABAD TELANGANA ASSEMBLY SPEAKER POCHARAM SRINIVAS REDDY IS CORONA POSITIVE SNR

Corona Fear : స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్ .. మూడోసారి ఎటాక్ చేసిన మహమ్మారి

pocharam Corona positive

pocharam Corona positive

Pocharam Srinivas Reddy: తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరోసారి కరోనా బారినపడ్డారు. జ్వరం, జలుబు లక్షణాలు ఉండటంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
తెలంగాణలో మళ్లీ కరోనా(Corona) వైరస్‌ వ్యాప్తి ప్రముఖులను విపరీతంగా భయపెడుతోంది. విషజ్వరాల రూపంలో మెల్లిగా అటాక్ చేసి అనారోగ్యానికి గురి చేస్తోంది. తాజాగా తెలంగాణ శాసనసభాపతి (Assembly Speaker)పోచారం శ్రీనివాస్‌రెడ్డి(Pocharam Srinivas Reddy)కరోనా బారినపడ్డారు. ఈరోజు జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడటంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రిపోర్ట్‌లో పాజిటివ్‌(Positive)గా నిర్ధారణైంది. తన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని స్పీకర్ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు స్పీకర్. కేవలం డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులు హోమ్ ఐసోలేషన్‌(Home isolation)లో ఉండనున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.

Kidnapping case : ఇంటి దగ్గర ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లారు .. నాలుగు గంటల తర్వాత ఏం జరిగిందో తెలుసా



హోమ్ ఐసోలేషన్‌లో స్పీకర్..
గత కొద్ది రోజులుగా తనతో సాన్నిహిత్యంగా మెలిగిన వారు తనను కలిసిన వాళ్లంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. ఒకవేళ కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చూపించాలని సూచించారు.



జాగ్రత్తగా ఉండాలని సూచన..
స్పీకర్ మంగళవారం ఉదయం కూడా తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలల్లో పాల్గొన్నారు. బాన్సువాడ నుండి హైదరాబాద్ విచ్చేస్తున్న స్పీకర్ పోచారం గారు 11.30 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన తన కాన్వాయ్‌నును ఆపి సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు.

Himanshu Rao Kalvakuntla : మా తాత టైగరే : హిమాన్షు .. నెటిజన్ల సెటైర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన కేసీఆర్ మనవడు


 ఇది మూడో సారి ..
శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గతంలో రెండు సార్లు కరోనా బారినపడ్డారు. జనవరి 16వ తేదిన రెండో సారి కరోనా బారినపడటంతో అప్పుడు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి ట్రీట్‌మెంట్ పొందారు. మొదటి సారి గతేడాది నవంబర్‌ 24న కరోనా సోకింది. అప్పుడు కూడా హైదరాబాద్‌లో ట్రీట్‌మెంట్ పొందారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Corona positive, Pocharam Srinivas Reddy, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు