High court : ప్రాణాలకంటే ఎన్నికలే ముఖ్యమా..? ఎస్‌ఈసీ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు

తెలంగాణ హైకోర్టు(ఫైల్ ఫోటో)

High court on muncipal elections : రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు సీరియస్ అయింది..ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా అంటూ ప్రశ్నించింది.

  • Share this:
రాత్రీపూట కర్ఫ్యూ కొనసాగుతుందా లేదా అనేది మధ్యహ్నాం వరకు స్పష్టం చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కరోనా పరిస్థితులతో పాటు ఎన్నికల నిర్వహాణపై నేడు హైకోర్టులో విచారణ సంధర్భంగా మరోసారి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది..ప్రజలకు సంభందించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నెల ముప్పై వరకు కర్ఫ్యూ విధించిన నేపథ్యంలోనే దానిపై కోర్టు ప్రశ్నించింది.

ముప్పైవ తేది తర్వాత కర్ప్యూ కొనాసాగుతుందా లేదా అనే అంశాన్ని తెలిపాలని చెప్పింది. దీంతో ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత తెలుపుతామని ఏజీ కోర్టుకు వివరించారు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నారని ప్రశ్నించింది. ఒక్కరోజు ముందు కూడ ప్రజలకు నిర్ణయాలను చెప్పలేరా అని అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఏజీ మాత్రం ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతామని వివరించారు..

ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం తీరుపై తీవ్రంగా మండింది. ఎన్నికల సంఘానికి ప్రజల ప్రాణాలు ముఖ్యమా..? ఎన్నికలు ముఖ్యమా అని ప్రశ్నించింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. యుద్దం వచ్చినా..ఆకాశం విరిగి మీదపడినా..ఎన్నికలు నిర్వహించాలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి లేదా అని ప్రశ్నించింది. కొన్ని మున్సిపాలిటీలకు సమయం ఉన్నా ముందే ఎందుకు ఎన్నికలకు వెళ్లారని అడిగింది. అధికారుల అందరు కరోనా కట్టడికి చర్యలు తీసుకునే బదులు ఎన్నికల నిర్వాహాణలో ఉన్నారని చెప్పింది. కాగా కోర్టు ప్రశ్నలకు స్పందించిన ఎస్ఈసీ సభ్యులు ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహించామంటూ కోర్టుకు తెలిపారు.

కాగా కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని ప్రతిపక్ష నేతలు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే..కాని ఎన్నికలను ఆపేందుకు కోర్టు నిరాకరించింది. ఈనేపథ్యంలోనే ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఇప్పటికే ఎన్నికల నిర్వహాణ మరో కొద్ది గంటలే సమయం ఉండడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Published by:yveerash yveerash
First published: