హోమ్ /వార్తలు /తెలంగాణ /

Teenmar Mallanna : పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ డీజీపీకి తీన్మార్ మల్లన్న వరుస ట్వీట్‌లు ..ఏమని చేశారంటే..

Teenmar Mallanna : పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ డీజీపీకి తీన్మార్ మల్లన్న వరుస ట్వీట్‌లు ..ఏమని చేశారంటే..

MALLANNA,DGP(FILE)

MALLANNA,DGP(FILE)

Teenmar Mallanna: జర్నలిస్ట్, క్యూ న్యూస్‌ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. పోలీస్‌ బాస్‌ తిరిగే వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ల విషయంలో వరుస ట్వీట్‌లు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జర్నలిస్ట్(Journalist), క్యూ న్యూస్‌(Q News)నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) తెలంగాణ డీజీపీ(DGP) మహేందర్‌రెడ్డి(Mahender Reddy)ని ట్విట్టర్ (Twitter)ద్వారా ప్రశ్నించారు. సాధారణంగా పౌరులు, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) పాటించకపోతే చలాన్లు విధిస్తారు పోలీసులు. కాని డీజీపీ మహేందర్‌రెడ్డి వాడుతున్న వాహనాలపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్లు(Challans)ఆన్‌లైన్‌(Online)లో చూపిస్తున్నాయి. ఇదే లిస్ట్‌ని ట్వీట్టర్ ద్వారా షేర్ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డిని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ గారు మీరే రూల్స్ పాటించడం లేదు మరి ప్రజలను పాటించమని ఎలా చెబుతారంటూ క్వశ్చన్ వేశారు.

వెంటనే మరో ట్వీట్ ..

తీన్మార్ మల్లన్న ఉరఫ్ చింతపండు నవీన్‌కుమార్ ట్వీట్‌ చేసిన కొద్ది సేపటికే ఈ చలాన్‌లో సదరు డీజీపీ వెహికల్స్‌పై ఎలాంటి చలాన్లు లేవని .నో పెండింగ్ చలాన్స్ అని చూపించడంతో మరోసారి ట్వీట్ చేశారు మల్లన్న. అయితే ఈసారి మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూనే లాజిక్‌గా డిటెయిల్స్ అడిగారు తీన్మార్ మల్లన్న. తెలంగాణ డీజీపీ గారు వెంటనే మీ వాహనాలపై ఉన్న చలాన్లు చెల్లించినందుకు కృతజ్ఞతలు .. ఆ పేమెంట్‌ రశీదు కూడా ఉంటే ట్విట్‌లో పెట్టండి ప్రజలకు ఆదర్శంగా ఉంటుంది..మాఫీ చేశారన్న అపవాదు కూడా పోతది అంటూ రీ ట్వీట్ చేశారు తీన్మార్ మల్లన్న.

రశీసు పోస్ట్ చేయమని రిక్వెస్ట్..

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి పోలీసులు చలాన్లు విధిస్తారు. వాహనదారులు వాటిని చెల్లించని పక్షంలో ఎంత ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలో ఆన్‌లైన్‌లో కనిపించే విధంగా వాటిని ఉంచుతారు. తెలంగాణ పోలీస్ బాస్ తిరిగే వాహనాలపై కూడా అలాంటి ట్రాఫిక్ చలాన్లు ఉండటం వల్లే క్యూ న్యూస్‌ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న ఈ ట్వీట్ చేయడానికి కారణమైంది. ఎప్పుడూ పొలిటీషియన్స్‌ని విమర్శించే జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న ఈసారి పోలీస్‌ బాస్‌ ఇష్యూని టచ్ చేయడం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Published by:Siva Nanduri
First published:

Tags: DGP Mahendar Reddy, Teenmar mallanna, Telangana News

ఉత్తమ కథలు