Home /News /telangana /

HYDERABAD TECHIES MAY RETURN TO OFFICE IN OCTOBER DETAILS HERE VB

Work From Office: హైదరాబాద్ లో వర్క్ ఫ్రం హోంకు స్వస్తి.. ఆ తేదీ నుంచి ఆఫీస్ లకు రావాల్సిందే.. !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Work From Office: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ తో సహా దేశ వ్యాప్తంగా అనేక MNC కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభమైనందున ఐటీ సంస్థలు కూడా తమ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  కరోనా(Corona) మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ తో సహా దేశ వ్యాప్తంగా అనేక MNC కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం(Work From Home) ఇస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభమైనందున ఐటీ సంస్థలు కూడా తమ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఐటీ కారిడార్‌ను తిరిగి తెరవాల్సిన అవసరాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలను తమ ఉద్యోగులను కార్యాలయాల నుండి పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి రమ్మని ఇప్పటికే కోరాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయం(TCS) త్వరలోనే తమ ఉద్యోగులను కార్యాలయాలకు వచ్చి పని చేయాలని ఆదేశించింది.

  Whatsapp tricks: టైప్ చేయకుండా మెస్సేజ్ పంపడం.. ఓపెన్ చేయకుండా చదవడం.. ఇలాంటి ట్రిక్స్ తెలుసుకోండి..


  అక్టోబర్ 15 న దసరా సందర్భంగా దాని తర్వాత ఎప్పుడైనా తమ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే విధంగా ఐటీ కంపెనీలు చర్యలు తీసుకున్నారు. కరోనా థర్ట్ వేవ్ ను దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయంపై ముందుకు సాగుతామన్నారు. ఇతర ఐటీ కంపెనీలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశం ఉందదని IT మరియు పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ చెప్పారు. దసరా పండుగ తర్వాత ప్రతీ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యాన్ని తొలగించే అవకాశం ఉందని అతడు తెలిపారు. ఇదిలా ఉండగా.. కోవిడ్ 19 వ్యాప్తి ప్రస్తుతం తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

  WhatsApp: వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్.. ఇక ఆ అనుమానాలకు చెక్..


  వారి వైద్య భద్రతను పరిగణలోకి తీసుకొని.. ఐటీ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే విధానాన్ని మరో సారి ఆలోచిస్తే మంచిదని.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు.. ఐటీ కార్యాలయాలను తెరవాలని.. వర్క్ ఫ్రం హోంపై బోర్ కొట్టిందని.. తాము ఆఫీస్ కి వెళ్లి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కొంతమంది ఐటీ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాదాపు 60 నుంచి 70 శాతం మంది ఐటీ ఉద్యోగులు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్నారు. కనుక కోవిడ్ 19 నిబంధనలను అనుసరించి కార్యాలయాలకు వెళ్లడం అనేది ఉత్తమమని కొంతమంది ఐటీ నిపుణులు చెబుతున్నారు.

  వాహన కొనుగోలుదారులకు గుడ్​న్యూస్.. ఆ సంస్థ వాహనాల కొనుగోలుపై రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్.. వివరాలివే.. 


  పాఠశాలలను దశలవారీగా తెరిచిన విధంగానే ఐటీ సంస్థలను కూడా దశల వారీగా తమ ఉద్యోగులను కార్యాలయాలకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిదని.. ఐటీ ప్రొఫెషనల్ మరియు కార్యకర్త శశిధర్ వుప్పల అన్నారు. హైదరాబాద్(Hyderabad) లో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచరంగా తయారు అయింది. ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు రావడం మొదలైతే.. తమకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసులను అకస్మాత్తుగా మూసివేయడం వలన, రవాణా ఉద్యోగులు, హౌస్ కీపింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది మరియు ఆఫీసు క్యాంటీన్లలో పనిచేస్తున్న వారితో సహా ఈ కార్యాలయాలతో సంబంధం ఉన్న లక్షలాది మంది సహాయక సిబ్బంది తమ ఉపాధిని కోల్పోయారు.

  PM Kisan Credit Card: రైతులకు శుభవార్త.. ఇక నుంచి వాటి కోసం బ్యాంక్ కు వెళ్లకుండానే.. పూర్తి వివరాలివే..


  వర్క్ ఫ్రం హోం తీసేస్తే.. మళ్లీ వాళ్లకు ఉపాధి లభించే అవకాశం కూడా ఉంటుంది. వీళ్లందరిని అయినా దృష్టిలో ఉంచుకొని దీనిపై ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు స్వస్థి చెప్పాలని కొందరు కోరుకుంటున్నారు. అక్టోబర్ 15 (దసరా) తర్వాత నుంచి కార్యాలయాలు తెరిచే అవకాశం కనిపిస్తోంది.
  Published by:Veera Babu
  First published:

  Tags: IT Employees, Technology, Work From Home

  తదుపరి వార్తలు