M. Bala Krishna, Hyderabad, News18
ఓ ఘటన ఆ దంపతుల జీవితాన్ని మలుపు తిప్పింది. తమకు ఎదురైన అనుభవం.. గొప్ప విజయానికి నాందిపలికింది. సికాన్ వ్యాలీ నుంచి సేంద్రీయ వ్యవసాయానికి (Organic Farming) మళ్లించింది. మాధవి- వేణుగోపాల్ దంపతులు ఇద్దరు సిలికాన్ వ్యాలీ (Silicon Valley)లో కార్పొరేట్ కొలువు చేసే వారు. మాధవి పార్మసీ మరియు జెనిటిక్స్ లో మాస్టర్స్ పూర్తి చేయగా.., వేణు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వీరిద్దరూ బ్యాంకాక్ (Bangkok), మలేసియా (Malaysia), సింగపూర్లో (Singapore) పనిచేసి చివరగా సిలికాన్ వ్యాలీలో స్థిరపడ్డారు. లక్షల్లో సంపాదన. విలాసవంతమైన జీవితం. అంతా వదులుకొని 2003లో హైదరాబాద్ కు వచ్చేశారు. హైదరాబాద్ (Hyderabad) వచ్చిన కొత్తలో 25 ఎకరాల పొలం కొనుగోలు చేసి.. పొలం గట్లపై వెదురు, జామకాయ, చింత, టేకు చెట్లు నాటారు. మిగిలిన స్థలమంతా ఖాళీగానే వదిలేసారు. అయితే కొన్ని ఏళ్ల క్రితం మాధవికి నివ్వెర పోయే ఒక వార్త ఆమెను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఆమెకు ఆనారోగ్యం రావడంతో పరీక్షలు చేయించుకోగా... రొమ్ము క్యాన్సర్ వచ్చినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు.
రసాయనాలు వాడి పండించిన ఆహారాన్ని తీసుకోవడం వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు తేల్చారు. అలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం (Health) మరింత క్షిణిస్తుందని మాధవికి డాక్టర్లు చెప్పారు. దీంతో తమకు ఉన్న స్థలంలో రసాయనరహిత సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించారు. మాధవి తన నిర్ణాన్ని భర్తకు వేణుగోపాల్ కు చెప్పారు. సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలో తనకు తెలిసిన మెళకువలను భర్తకు వివరించారు. ఇందుకు భర్త కూడా సహకరించడంతో తమకు ఉన్న 25 ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయం చేయడమే కాకుండా తనకు వచ్చిన వ్యాధితో పోరాడి విజయం సాధించారామె.
తొలుత వీకెండ్ ఫార్మింగ్ మొదలుపెట్టిన ఈ దంపతులు.. తమ భూమిలో తమకు అవసరమైన వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకు కూలరు పండించడం మొదలుపెట్టారు. ఇలా టమోటాలు, మిరప, కాకరకాయ, బెండకాయ, అల్లం మరియు గుమ్మడి కాయ పండిస్తున్నారు. ఇక బంతి పువ్వులను సైతం ఇక్కడ సాగు చేస్తున్నారు. బంతి పులా పెంపు వారికి తెగుళ్లను నివారించే అద్భుతమైన నివారిణిగా ఉపయోగ పడుతోంది. తమ పొలంలో ముప్పై రకాల 2వేల మామిడి చెట్లను నాటారు. పూర్తి సేంద్రీయ పద్దతుల్లో వ్యవసాయం చేస్తుండటంతో దిగుబడి కూడా బాగానే వస్తోంది. ఆరోగ్యం కూడా ఆదాయం కూడా సంపాదిస్తున్నారీ దంపతులు.
వారికి వచ్చిన విజయంతో అక్కడే ఆగిపోకుండా వేణు-మాధవిలు ఏదొక విధంగా సమాజానిక. తమవంతు సహకారాన్ని అందించాలని భావించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా విస్తరాకులు ద్వారా ప్లేట్లను తయారు చేస్తున్నారు. ఇలా పది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. సేంద్రీయ ఉత్పత్తులను తమ ఇంట్లోకి వినియోగిండంతో పాటు మార్కెట్ కు తరలించి లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్లేట్ల తయారీలోనూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.
"మేము మా వ్యవసాయ భూమిలో ఒక చిన్న ఉత్పత్తి యూనిట్‌ను నిర్మించాము. అక్కడ స్థానిక మహిళలు వచ్చి ప్లేట్‌లను కొడుతుంటారు. వారికీ ఇక్కడ పనిచేయడం చాల ఆనందం. ఉదయం 9 నుండి, వారు కలిసి కూర్చుని.. కబుర్లు చెప్పుకుంటూ.. సంగీతం వింటూ ప్లేట్‌లను చేతితో కొడుతుంటారు. వాళ్ళు చేసే పనిలో ఎలాంటి గందరగోళం ఉండదు... వారి కష్టాన్ని తగిన వేతనం రోజువారీగా లభిస్తుంది. మేము కూడా వారితో కలసి భోజనం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఇది సంతోషకరమైన వెంచర్ ” అని వేణు తన ఆనందాన్ని పంచుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Andhra Pradesh, Hyderabad, Organic Farming, Software