టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(Bojjala Gopalakrishna Reddy)మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో తనతో కలిసి పనిచేసిన రాజకీయ సహచరుడ్ని, ఆత్మీయ మిత్రుడ్ని కోల్పోయానని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. బొజ్జల కృష్ణారెడ్డి అకాల మరణంపై ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతే కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జలను స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కలిశారు తెలంగాణ(Telangana)సీఎం కేసీఆర్. ఆ సమయంలో బొజ్జల గోపాలకృష్ణను పరామర్శించి..ఆయనకు జ్ఞాపికను అందజేసిన సందర్భాన్ని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు కేసీఆర్. అలాగే బొజ్జల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో మాట్లాడిన వీడియోని సైతం అందరితో పంచుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. 73సంవత్సరాల బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్(Hyderabad)లోని అపోలో ఆసుపత్రి(Apollo Hospital)లో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. బొజ్జల మృతిపై అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వివాదరహితుడు, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా టీడీపీలో పేరు సంపాధించుకున్నారు.
బొజ్జలకు కేసీఆర్ సంతాపం..
బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఏప్రిల్ 15, 1949న ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసులోని ఉరుందూరులో జన్మించారు. 1989–1994, 1994–1999, 1999–2004, 2009–2014 మధ్య ఐదుసార్లు ఎమ్మెల్యేగా, 2014 నుంచి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శ్రీ కాళశతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పర్యావరణ ,అటవీ, సైన్స్ & టెక్నాలజీ, సహకార మంత్రిగా కూడా పనిచేశారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తండ్రి సుబ్బరామిరెడ్డి కూడా శ్రీకాళహస్తి నుండి గతంలో ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఇదే అసెంబ్లీ స్థానం నుండి బోజ్జల గోపాలకృష్ణారెడ్డి గెలుపొందారు.
ఆత్మీయ మిత్రుడ్ని కోల్పాయనన్న సీఎం..
1968లో ఆయన బీఎస్సీ డిగ్రీ పొందారు. 1972 లో లా పట్టాను అందుకొన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలోనే ఆయన చదువుకున్నారు. కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి కూతురు బృందమ్మను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వివాహం చేసుకొన్నారు.1989లో బోజ్జల గోపాలకృష్ణారెడ్డి తొలిసారిగా శ్రీకాళహస్తి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో టీడీపీ తరపున తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.1994,1999, 2009, 2014లలో కూడా ఆయన శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు కేబినెట్ లో అటవీశాఖ మంత్రిగా ఆయన సేవలందించారు. చంద్రబాబునాయుడు కేబినెట్ విస్తరణ సమయంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని తప్పించారు. అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయనను కేబినెట్ నుండి తప్పించినారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన బాంబు సంఘటనలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి కూడా గాయాలపాలయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, CM KCR, TDP