హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: హైదరాబాద్‌లో టీడీపీ ఆవిర్భావ సభ.. ఆ పార్టీ లక్ష్యం ఇదేనట..!

Hyderabad: హైదరాబాద్‌లో టీడీపీ ఆవిర్భావ సభ.. ఆ పార్టీ లక్ష్యం ఇదేనట..!

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

ఇంటింటికి టీడీపీ' కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి.. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీలో టీడీపీ (TDP)లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలో నూతనోతేజాన్ని నింపాయి. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు అదే ఊపుతో తెలంగాణ (Telangana)లోనూ పార్టీ బలోపేతంపై టీడీపీ దృష్టిసారించింది. టీటీడీపీ (TTDP) అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీడీపీ మళ్లీ క్రియాశీలం అయింది. ఖమ్మం (Khammam) సభ విజయవంతం కావడంతో పార్టీ కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా సభకు ప్లాన్‌ చేస్తున్నారు.

మార్చి 29న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో లక్ష మందితో సభను నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ముందు నుంచీ టీడీపీకి కొంత పట్టుంది. ఆంధ్రా సెటిలర్లలో చాలా మంది పార్టీ సానుభూతి పరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కొంత శ్రద్ధ పెడితే.. హైదరాబాద్ సిటీలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని టీడీపీ తమ్ముళ్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో టీడీపీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభకు తెలంగాణతో పాటు ఏపీకి చెందిన ముఖ్య నేతలు కూడా హాజరవుతారు.

తెలంగాణలో టీడీపీ ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపట్టింది.  'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి.. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. కొందరు నేతలు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడుతున్నారు. సోషల్ మీడియాను మళ్లీ యాక్టివ్ చేస్తున్నారు. టీడీపీ నుంచి వెళ్లిపోయిన నేతలు, కార్యకర్తలు... మళ్లీ పార్టీలోకి రావాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 10 సీట్లయినా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా పార్టీని బలోపేతం చేయడంపై చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర నేతలు సీరియస్‌గా దృష్టిసారించారు.

First published:

Tags: Chandrababu Naidu, Local News, TDP, Telangana

ఉత్తమ కథలు