KTR-Revanth Reddy: రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించిన మంత్రి కేటీఆర్.. ఏ పరీక్షలకైనా సిద్దం అంటూ ట్వీట్..

కేటీఆర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

KTR-Revath Reddy: రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్‌పై ( Revanth Reddy White Challenge) ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ( MINISTER KTR ) స్పందించారు. తాను ఢిల్లీ వెళ్లి ఎయిమ్స్‌లో ఎలాంటి పరీక్షలు చేయించుకోడానికైనా సిద్ధంగా ఉన్నానని ట్విటర్​ వేదికగా స్పష్టం చేశారు.

  • Share this:
    రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్‌పై ( Revanth Reddy White Challenge) ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ( MINISTER KTR ) స్పందించారు. తాను ఢిల్లీ వెళ్లి ఎయిమ్స్‌లో ఎలాంటి పరీక్షలు చేయించుకోడానికైనా సిద్ధంగా ఉన్నానని ట్విటర్​ వేదికగా స్పష్టం చేశారు. అయితే రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పరీక్షలు చేయించుకోవాలని సవాల్‌ చేశారు. చర్లపల్లి జైలు వెళ్లొచ్చిన వారితో తన స్థాయి కాదని... కేటీఆర్ (KTR)​ వ్యంగ్యాస్త్రం సంధించారు. డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన సవాల్ దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డి సవాల్ కు మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు.

    Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..


    డ్రగ్స్ వ్యవహారంపై ట్విట్టర్ వేదిక తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధం కావాలని, కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా వస్తారని రేవంత్ రెడ్డి ఇటీవల సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి సవాల్ మీద కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. వ్యవహారంలోకి ఆయన రాహుల్ గాంధీని లాగారు. రాహుల్ గాంధీ పరీక్షకు సిద్ధపడితే తాను రెడీగా ఉన్నానని ఆయన చెప్పారు. డ్రగ్స్ కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పరీక్షలలో తనకు నెగెటివ్ వచ్చి క్లీన్​చిట్ లభిస్తే... రేవంత్ (Revanth) క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా అని ప్రశ్నించారు. మరోవైపు రేవంత్‌ ఓటుకు నోటుకు (vote for note case) వ్యవహారంలో లైడిటెక్టర్ పరీక్షలు సిద్దమా అని కూడా ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు.




    సామాజిక కార్యకర్తగానే కాకుండా పేరెంట్ గా తాను డ్రగ్స్ కు వ్యతిరేకమని కొండా విశ్వేశ్వర రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని ఆయన ఆయన అన్నారు. చాలా మంది సంపన్నుల పిల్లలు డ్రగ్స్ వాడుతూ జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. సమాజంలో డ్రగ్స్ విస్తరిస్తూ సమాజాన్ని, కుటుంబాలను భ్రష్టు పట్టిస్తున్నాయని ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి వైట్ ఛాలెంజ్‌లో ( Revanth Reddy White Challenge) విశ్వేశ్వరరెడ్డి పాల్గొననున్నారు.

    సోమవారం 12 గంంటలకు గన్‌పార్క్ (gunpark) అమరవీరుల స్థూపం వద్దకు రానున్నారు. రేవంత్‌రెడ్డి వైట్‌ ఛాలెంజ్‌పై మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు. వైట్ ఛాలెంజ్‌ను విశ్వేశ్వరరెడ్డి స్వీకరించడం మంచి పరిణామమని వెల్లడించారు. వైట్ టెస్టుకు సిద్ధపడిన కొండా విశ్వేశ్వర రెడ్డిని కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ప్రశంసించారు.

    డ్రగ్స్ అంబాసిడర్ సిద్ధపడుతారా అని ఆయన కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. మొత్తం మీద, డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ ను చిక్కుల్లో పడేసే ఉద్దేశంతో కాంగ్రెసు పార్టీ వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. వీళ్ల ఛాలెంజ్ లు ఎంత దూరం వెళ్తాయో.. ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠలో సామాన్య ప్రజానికం ఉన్నారు.
    Published by:Veera Babu
    First published: